బోయినపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణపైలోతుగా పరిశీలించారు.

విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు.పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు.

పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించారు.పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని,సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలన్నారు.గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు.

Advertisement

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ ( Police station )పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.

ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి( DSP Nagendrachari ), సి.ఐ బన్సీలాల్, ఎస్.ఐ మహేందర్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News