టీ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ఎంతో మంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు.ఆయన నాకత్వాన్ని సవాల్ చేస్తూనే ఉన్నారు.
ఇక ఇలాంటి తరుణంలో వారు రేవంత్ చేపట్టిన ప్రతి పనిని కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు.ఆయన చేపిట్టిన ఏ కార్యక్రమానికి కూడా రావట్లేదు.
ఇక మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే మొదటి నుంచి ఇదే వాదన.రేవంత్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ తమ ఇష్టం అన్నట్టు సాగుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే వారి వ్యవహారం ఏకంగా ఢిల్లీ దాకా పాకింది.అయితే వారికి చెక్ పెట్టేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
ఇక ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి బ్రద్రర్స్ తో పాటు మరి కొందరు సీనియర్లు అసంతృప్తిలోఉండటంతో పీసీసీ కొత్త కార్యవర్గం నియమించిన కొద్దిరోజులకే మరో టీంను కూడా ఢిల్లీ అధిష్టానం అనౌన్స్ చేసింది.ఇక ఈ కొత్త తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా ఎంతో ఆచితూచి అసంతృప్తులకు చోటు దక్కేలా చూస్తూ ఢిల్లీ వర్గాలు నియమించాయి.
కాగా ఇందులో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిత పాటు ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదువులు ఇచ్చి వారిని శాంతింపజేశారు.ఇక వీరే కాదు పలువురు సీనియర్లకు ఇందులో చోటు ఇచ్చారు.

మరీ ముఖ్యంగా ఇందులో అసంతృప్త నేతలకు పదువులు ఇవ్వడం గమనార్హం.ఇందులో ప్రస్తత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు సీనియర్లు అయిన వి.హనుమంతరావు, జానా రెడ్డితో పాటు మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వారు కూడా ఉండటం ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఎందుకంటే ఇందులో రేవంత్ ను వ్యతిరేకించిన వారే ప్రధానంగా ఉన్నారు.
ఏదేమైనా కూడా రేవంత్ భవిష్యత్‌లో వీరి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసేందుకు ఇలాంటి పదవులు కట్టబెట్టారని సమాచారం.