సంక్రాంతి కి డిస్కో రాజా డాన్స్ ఏంటో చూపిస్తా అంటున్న రవితేజ!

మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్యకాలంలో ఒక హిట్ కొడితే రెండు ఫ్లాప్ లని తన ఖాతాలో వేసుకుంటూ డిఫరెంట్ ట్రాక్ రికార్డ్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

వరుస విజయాలు అందుకోవడంలో రవితేజ దారుణంగా విఫలం అవుతున్నాడు.

ఒకే తరహా కథలు ఎంచుకుంటూ తనలోని ఎనర్జీని ఉపయోగించి మెప్పించే ప్రయత్నం చేస్తున్న ఆడియన్స్ మాత్రం పాస్ మార్కులు కూడా వేయడం లేదు.ఈ కారణంగానే రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ సినిమాలని ఖాతాలో వేసుకున్నాడు.

రవితేజ ప్రస్తుతం పీరియాడికల్ టైం ట్రావెలింగ్ స్టొరీ అయిన డిస్కో రాజాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా రూపొందుతూ ఉండగా రవితేజ ద్విపాత్రాభినయంలో చాల గ్యాప్ తర్వాత మళ్ళీ కనిపిస్తున్నాడు.

పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ‘డిస్కో రాజా’లో రవితేజ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాట్లు ఇప్పటికే టాక్ బయటకి వచ్చింది.కాగా 2020 సంక్రాంతికి ఈ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చి ఇప్పటికే రెండు విజయాలు అందుకున్న రవితేజ డిస్కో రాజాతో మరో సక్సెస్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు