ఎనిమల్ లో ఆ పాత్ర ఆ నటుడే చేయగలడు : సందీప్ రెడ్డి వంగ...

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుంది అనేది ఎవరికీ తెలియదు.

ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో నటించి బిజీ అయిపోవాలనే ఉద్దేశ్యం తోనే ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది.

ఇక అలాంటి క్రమంలో ఇక్కడ ఎందుకు ఇంతకు ముందు నటించిన చాలా మంది నటులు వాళ్ళ అవకాశాలను కోల్పోతున్నారు.అంటే వాళ్ళు నటన పరంగా అప్డేట్ అవ్వకపోవడం మంచి అవకాశాలు రాకపోవడం, వచ్చిన అవకాశాల్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల ఇండస్ట్రీ అవకాశాలను అందుకోలేక పోతున్నారు.

ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.అలాగే హిందీలో కూడా షాహిద్ కపూర్ తో కభీర్ సింగ్ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు.ఇప్పుడు రన్ భీర్ కపూర్ తో ఎనిమల్( Animal ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు అయిన పృధ్విరాజ్ ను తీసుకోవడం జరిగింది.ఆ క్యారెక్టర్ కోసం ఎంతమందిని చూసినా కూడా సందీప్ రెడ్డి వాళ్ళు ఎవరిని ఓకే చేయకపోవడం వాళ్ళు చేసే నటన నచ్చకపోవడంతో తనే స్వయంగా పృథ్వీరాజ్( Pruthvi Raj ) అయితే బాగా చేస్తారని అతన్ని పిలిపించి అతని చేత ఆ క్యారెక్టర్ చేయించాడు.

Advertisement

సందీప్ రెడ్డి వంగ( Director Sandeep Reddy Vanga) పెట్టుకున్న నమ్మకాన్ని పృధ్వీరాజ్ ఏ మాత్రం ఒమ్ము చేయకుండా ఒక పేజీ డైలాగ్ లను సింగిల్ టేక్ లో చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడట అయితే ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఆయన యాక్టింగ్ ఏ మేరకు ఉందో మనం చెప్పలేం.ఇక ఇలా సీనియర్ నటులు మళ్ళీ బిజీ అయిపోవడం చూస్తుంటే ఒక వంతకు మంచిదే అనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమం లో చాలా మంది సీనియర్ నటులు మళ్ళీ తెరపైకి వస్తున్నారు.

ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 
Advertisement

తాజా వార్తలు