పవన్ రిజెక్ట్ చేసిన కథతో వడ్డే నవీన్ హిట్ కొట్టాడట.. ఏ సినిమా అంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ దర్శకులలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథతో వడ్డే నవీన్ తో సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు.

బాలకృష్ణతో పవిత్ర ప్రేమ సినిమాను తెరకెక్కించి ఆ సినిమాతో సక్సెస్ అందుకున్న ముత్యాల సుబ్బయ్య శీనయ్య అనే వ్యక్తితో కలిసి కథలు వింటూ ఉండేవారు.ముత్యాల సుబ్బయ్య, శీనయ్యకు ఒక కథ నచ్చగా పవన్ తో సినిమాను తెరకెక్కించాలని భావించారు.

అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆ కథ నచ్చకపోవడంతో సున్నితంగా రిజెక్ట్ చేశారు.మరో కథ ఉంటే చెప్పాలని ముత్యాల సుబ్బయ్యకు పవన్ కళ్యాణ్ సూచించారు.

అయితే పవన్ రిజెక్ట్ చేయడం వల్ల శీనయ్య బాగా ఫీలయ్యారు.ఆ సమయానికి పెద్ద హీరోలు ఖాళీగా లేకపోవడంతో ముత్యాల సుబ్బయ్య అదే కథ చెప్పి వడ్డే నవీన్ ను ఒప్పించారు.

Director Mutyala Subbayya Comments About Vadde Naveen Movie Snehithulu, Two Lakh
Advertisement
Director Mutyala Subbayya Comments About Vadde Naveen Movie Snehithulu, Two Lakh

సాధారణంగా వడ్డే నవీన్ రెమ్యునరేషన్ 15 లక్షల రూపాయలు కాగా 20 లక్షలు తీసుకుంటున్నానని వడ్డే నవీన్ ముత్యాల సుబ్బయ్యకు చెప్పారు.చివరకు పదిహేడున్నర లక్షలకు రెమ్యునరేషన్ ను ఫైనలైజ్ చేసి ముత్యాల సుబ్బయ్య అడ్వాన్స్ ఇచ్చి వచ్చేశారు.స్నేహితులు అనే టైటిల్ తో రాశి, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఆ సినిమా సక్సెస్ సాధించింది.

Director Mutyala Subbayya Comments About Vadde Naveen Movie Snehithulu, Two Lakh

ఆ సినిమాకు తాను 20 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నానని ముత్యాల సుబ్బయ్య అన్నారు.వడ్డే నవీన్ కు అదనంగా ఇచ్చిన 2.5 లక్షల రూపాయలను తగ్గించుకొని మిగిలిన మొత్తం ఇవ్వమని శీనయ్యకు చెప్పానని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.తనకు, శీనయ్యకు మధ్య డబ్బును మించిన అనుబంధం ఉందని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు