రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం: కొత్త కాన్సెప్ట్ తో అదరగొట్టిన డైరెక్టర్?

జైదీప్ విష్ణు దర్శకుడిగా రూపొందిన సినిమా రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం.డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాను వారధి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద నిర్మించారు.

 Director Jaideep Vishnu Rebels Of Thupakulagudem Movie Review And Rating Details-TeluguStop.com

ఇందులో ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా, శివరాం రెడ్డి సహా 40 మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో నటించారు.ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా సినిమా పై భారీ అంచనాలు వెలువడ్డాయి.దీంతో ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.పైగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో నక్సలిజం సమస్యలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తుంది.దీంతో నక్సలైట్లు ఒకవేళ  సరెండర్ అయితే వారికి మూడు లక్షల రూపాయల డబ్బు, పోలీసు ఉద్యోగం అందిస్తాము అని తెలుపుతారు.

ఇక ఈ నేపథ్యంలో నక్సలైట్ల పేరుతో  అక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల వ్యక్తులను సరెండర్ చేయటానికి ఒక బ్రోకర్ ప్లాన్ కూడా చేస్తాడు.ఇక ఈ విషయం రాజన్న దృష్టికి వెళ్తుంది.

Telugu Jaideep Vishnu, Jayatri Makana, Manisharma, Praveen Kandela, Thupakulagud

రాజన్న ఎవరంటే ఏజెన్సీ మొత్తం దొరల ఫీలయ్యే వ్యక్తి.ఇక రాజన్న వెంటనే ఆ పనిని తన దగ్గర పని చేస్తున్న కుమార్ అనే వ్యక్తికి అప్పచెప్పుతాడు.ఇక బ్రోకర్ సర్కారు ఉద్యోగం ఫ్రీగా ఇవ్వలేమంటూ లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెడతాడు.దాంతో వందమంది కలిసి ఆ బ్రోకర్ కి కోటి రూపాయలు అందజేస్తారు.

ఇక ఆ బ్రోకర్ అక్కడి నుంచి మిస్ అవుతాడు.దీంతో ఆ వందమంది ఏమవుతారు.

వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా రావా.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

Telugu Jaideep Vishnu, Jayatri Makana, Manisharma, Praveen Kandela, Thupakulagud

నటినటుల నటన:

ఇక ఇందులో నటించిన నటులంతా కొత్త వాళ్లే.అయినప్పటికీ కూడా తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు.చాలావరకు అనుభవమున్న నటులుగా నటించి ప్రేక్షకులను తొలి చూపులతోనే మెప్పించారని చెప్పాలి.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా కథ అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను.మణిశర్మ అందించిన సంగీతం మాత్రం ఫిదా చేసిందని చెప్పవచ్చు.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.

Telugu Jaideep Vishnu, Jayatri Makana, Manisharma, Praveen Kandela, Thupakulagud

విశ్లేషణ:

ఈ సినిమా మొత్తం అడవుల నేపథ్యంలో సాగింది.ఇక ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.బ్రోకర్ మోసం చేసే విధానంతో కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది.చాలావరకు డైరెక్టర్ మంచి మంచి సన్నివేశాలను చూపించాడు.ఎక్కడ బోరింగ్ అనే కాన్సెప్ట్ లేకుండా  ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, కామెడీ.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగినట్లు అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సింది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube