కౌశల్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్న బోయపాటి శ్రీను

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ద్వారా విశేష ఆధరణ, అభిమానులను సంపాదించుకున్న కౌశల్‌ ఖచ్చితంగా విజేత అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ అంటూ ఆయన అభిమానులు చెబుతున్న నేపథ్యంలో కౌశల్‌కు భారీ ఎత్తున సినిమాల్లో ఆఫర్లు ఎదురు చూస్తున్నాయి.

కౌశల్‌ ఆర్మీ ఆమద్య నిర్వహించిన 2కే రన్‌ ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే.కౌశల్‌కు దక్కిన ఆధరణను క్యాష్‌ చేసుకునేందుకు ప్రముఖ దర్శకుడు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఆ చిత్రం తర్వాత బాలయ్యతో ఒక చిత్రంకు ఇప్పటికే స్క్రిప్ట్‌ సిద్దం చేయడం జరిగింది.ఆ చిత్రంలో కీలక పాత్రలో కౌశల్‌ ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

కౌశల్‌ భార్య నీలిమతో ఇప్పటికే పలువురు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.కాని నీలిమ మాత్రం కౌశల్‌ వచ్చే వరకు తాను ఏ నిర్ణయం తీసుకోలేను అని, ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్బంగా చెప్పుకొస్తుంది.

Advertisement

మరో రెండు వారాల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ముగియబోతుంది.ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ కౌశల్‌ ఇంటికి సినీ వర్గాల వారు మరియు బుల్లి తెర వర్గాల వారు క్యూ కడుతున్నారు.ఇప్పటికే పలు సీరియల్స్‌లో నటించి మెప్పించిన ఇకపై సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది.

గతంలో ఏ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్‌కు కూడా దక్కని అరుదైన గుర్తింపు కౌశల్‌కు దక్కింది అంటూ అంతా కూడా అంటున్నారు.కౌశల్‌పై ఇంటి సభ్యులు అంతా కూడా ఎదురు దాడి చేస్తున్న నేపథ్యంలో తను మాత్రం తాను అనుకున్న విషయంలోనే ముందుకు నడుస్తున్నాడు.

కౌశల్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచేసుకున్నాడు.త్వరలోనే బిగ్‌ బాస్‌ టైటిల్‌ను కూడా గెలిచేసుకుంటుందనే నమ్మకంతో కౌశల్‌ ఆర్మీ ఉంది.ఇక సినిమాల్లో ఆఫర్లు అనేవి అదనంగా రాబోతున్నాయి.

ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?
Advertisement

తాజా వార్తలు