అబ్బో.. మహేష్ ప్లాప్ సినిమా కోసం అప్పట్లోనే సుకుమార్ రాజమౌళినే రంగంలోకి దించాడా?

సినిమాలను విడుదల చేసే ముందు సినిమా గురించి ముందే ప్రమోషన్ భాగంలో కాంప్లిమెంట్ ఇచ్చి ఎలాగైనా సినిమాను చూసే ప్రయత్నం చేస్తారు సినీ బృందం.

ఇక ఆ ప్రమోషన్ భాగంలో మాత్రం సినిమా గురించి ఎంతో అద్భుతంగా చెబుతారు.

కానీ కొన్ని కొన్ని సార్లు ప్రమోషన్ లో మెప్పించినట్లు తెరమీద మెప్పించలేకపోతాయి.అలా ఎన్నో సినిమాలు ప్రమోషన్ లో భాగంగా ఎంత పాజిటివ్ టాక్ వస్తుందో ఆ సినిమా విడుదల అయ్యాక మాత్రం ఆ పాజిటివ్ టాక్ అనేది మొత్తం పోతుంది.

ఇప్పటికే చాలా సినిమాలు ప్రమోషన్ లో మెప్పించిన తెర మీద మాత్రం మెప్పించలేకపోయాయి.అలా ఎన్నో రోజులు షూటింగ్ లో కష్టపడి తమ సినిమాను తెరకెక్కించే సమయంలో దర్శక నిర్మాతలు ముందుగానే కొన్ని ప్లాన్ లు చేసుకుంటారు.

ఇండస్ట్రీలో ఏ హీరోకైనా, ఏ దర్శకుడికైనా మంచి అభిమానం ఉంటే ముందుగా వాళ్లకు ఆ సినిమాను చూయించి.సినిమా ప్రమోషన్ భాగంలో వారినే ముందు ఉంచి తమ సినిమా గురించి అద్భుతంగా చెప్పేలా ప్రయత్నాలు చేస్తారు.

Advertisement

దాంతో ఆ సినిమా కాంప్లిమెంట్ గురించి ఇంత పెద్ద హీరో లేదా డైరెక్టరో చెప్పేసరికి ప్రేక్షకులలో సినిమా చూడాలనే ఆతృత వెంటనే పుట్టుకొస్తుంది.

కానీ సినిమా చూసే వరకు కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులను మెప్పించక ప్లాఫ్ అవుతుంటాయి.దీంతో సినీ బృందం, ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన సెలబ్రెటీ మరో మాట మాట్లాడలేకపోతారు.అలాంటి సంఘటననే గతంలో సుకుమార్, రాజమౌళి కూడా ఎదుర్కొన్నారు.

ఇంతకు అసలేం జరిగిందంటే.గతంలో సుకుమార్ తన దర్శకత్వంలో 1-నేనొక్కడినే అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు.కానీ ఈ సినిమా ప్రేక్షకులను అస్సలు మెప్పించలేకపోయింది.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

దీంతో మహేష్ బాబుకు ఈ సినిమా నుండి బాగా నిరాశ ఎదురయింది.నిజానికి ఈ సినిమా తమకు ఫ్లాప్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు.

Advertisement

కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో సినిమా ఫ్లాఫ్ అయ్యింది.

గతంలో ఈ సినిమా ప్రమోషన్ కోసం డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా గురించి ప్రేక్షకులకు అద్భుతంగా తెలియజేయడానికి ఏకంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళినే రంగంలోకి దింపాడు.దీంతో బుల్లితెరపై ఈ సినిమా ప్రమోషన్ భాగంలో సుకుమార్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశాడు.రాజమౌళి ఏ సినిమానైనా చూసి బాగుందని కాంప్లిమెంట్ ఇస్తే చాలు వెంటనే ఆ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తారు ప్రేక్షకులు.

అలా 1 నేనొక్కడినే సినిమా పై కూడా రాజమౌళి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు.రివ్యూలకు సంబంధం లేకుండా చేజ్ సీన్స్ తప్ప ఈ సినిమాని తాను ఎంజాయ్ చేశాను అంటూ.పైగా సుకుమార్ తనకు మరోసారి ఫేవరెట్ అయ్యారని తెలిపాడు.

ఈ సినిమాలో మ్యూజిక్ తనకు నచ్చిందని కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయని పైగా క్లైమాక్స్ కూడా బాగుందని చెప్పడంతో వెంటనే ప్రేక్షకులు ఈ సినిమా కోసం బాగా ఆరాటపడ్డారు.కానీ సినిమా చూశాక అందులో ఏమీ లేదు అంటూ నిరాశ చెందారు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం మరోసారి బయటపడగా నెటిజన్లు.అబ్బో మహేష్ బాబు ఫ్లాప్ సినిమా కోసం సుకుమార్ రాజమౌళినే రంగంలోకి దింపాడా అనే కౌంటర్లు వేస్తున్నారు.

తాజా వార్తలు