గెస్ట్ లెక్చరర్స్ ను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా...!

సూర్యాపేట జిల్లా:గత పది సంవత్సరాల నుండి ఎం.ఎల్.

టి మరియు ఎం.

పి.హెచ్.

డబ్ల్యు జూనియర్ కళాశాలలో( Junior colleges ) పదివేల జీతంతో గెస్ట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారిని తీసేయడం వలన వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్,యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వేపూరు సుధీర్,తెలుగు యువత నాయకులు తామస్అన్నారు.సోమవారం సూర్యాపేట జి( Suryapet )ల్లా నడిగూడెం మండల కేంద్రంలో గెస్ట్ లెక్చరర్స్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్స్( Guest lecturers ) ను తీసివేయడం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కళాశాల మొదలై నెల రోజులు గడుస్తున్నా క్లాసులు జరగడం లేదని అన్నారు.ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో వృత్తి విద్యా కోర్సులను ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

విద్యార్థుల భవిష్యత్ ను,గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1600 మంది గెస్ట్ లెక్చరర్స్ ను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాబోయే రోజుల్లో అఖిలపక్ష విద్యార్ది,యువజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్ది, యువజన సంఘాల నేతలు,విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News