Devi Sri Prasad: ఆ సింగర్ ని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీప్రసాద్.. ఫొటోస్ వైరల్..!!

దక్షిణ భారతీయ సినీ చరిత్రలోనే తన సంగీతంతో ఎంతోమంది కుర్రకారును ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు.గాయకుడు.

అయిన దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad ) మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం.ఈయన అప్పటి హిట్ సినిమాలైనా నీకోసం, ఆనందం, ఖడ్గం,బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు,ఆర్య ( Aarya ),నుండి ఇప్పటి సరేలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్ అందించారు.

మ్యూజిక్ అందించడమే కాకుండా పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతారు.అయితే ఈయన ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం అంత ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే నాలుగు పదుల వయసు దాటినా కూడా డిఎస్పీ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటున్నారు.దీనికి కారణం గతంలో సినీ నటి అయిన చార్మి ( Charmi )ప్రేమలో ఆయన మోసపోవడమేనట.

Advertisement
Devi Sri Prasad Who Is Going To Marry That Singer-Devi Sri Prasad: ఆ సి�

ఎంతో ఘాడంగా చార్మిని ప్రేమిస్తే ఆమె అతన్ని మోసం చేసి వెళ్ళిపోయిందని, అప్పటినుండి ప్రేమ పెళ్లి పై తనకి నమ్మకం పోయిందని కొన్ని వార్తలు వినిపించాయి.అయితే ఇప్పటికే ఎన్నోసార్లు దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad ) పెళ్లి వార్తలు వినిపించాయి.

Devi Sri Prasad Who Is Going To Marry That Singer

ఇక మరోసారి కూడా పెళ్లి అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అసలు విషయం ఏమిటంటే.పుష్ప (Pushpa) సినిమాలోని ఊ అంటావా మావా.

ఉ ఉ అంటావా మావా.అనే పాటతో ఓవర్ నైట్ లో స్టార్ సింగర్ అయిపోయిన మంగ్లీ( Mangli ) చెల్లెలు ఇంద్రావతితో దేవి శ్రీ ప్రసాద్ కొన్ని ఫోటోలు దిగారు.

అయితే ఆ ఫోటోలను ఇంద్రావతి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

Devi Sri Prasad Who Is Going To Marry That Singer
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?

ఇక ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెట్టింట్లో మొత్తం వైరల్ అవ్వడంతో ఇవి చూసిన కొంతమంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.మీ జంట చాలా బాగుంది.మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు.

Advertisement

ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే.అంటూ ఇలా వీరి పెళ్లి వార్తలు వైరల్ చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి ( Indravathi ) తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అనే న్యూస్ వైరల్ గా మారింది.

తాజా వార్తలు