దేవర మూవీ గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ ( Junior NTR, Koratala Siva )కాంబో మూవీ దేవర సినిమా( Devara movie ) ట్రైలర్ విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

దేవర సినిమాకు ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదే టాక్ వినిపిస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ తో పాటు ఎన్నో నెగిటివ్ సెంటిమెంట్లకు చెక్ పెట్టే మూవీ దేవర అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా మాస్ సినిమా కావడంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో వింటేజ్ తారక్ ను చూడబోతున్నామని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సినిమాలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే తారక్ ఫ్యాన్స్( Tarak fans ) సైతం ఎంతో సంతోషించే ఛాన్స్ ఉంది.దేవర సినిమాలో ట్విస్టులు సైతం ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పడుతున్న కష్టం కూడా ప్రేక్షకులకు కళ్ల ముందు కనిపిస్తోంది.ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దేవర సినిమా సంచలనాలు సృష్టిస్తోంది.దేవర సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

దేవర సినిమా తారక్ రేంజ్ ను పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 28, గురువారం, 2021
Advertisement

తాజా వార్తలు