బిబి4: నోయల్‌ని పెళ్లి చేసుకుంటానంటున్న హారిక‌.. ఫైర్ అయిన గంగవ్వ?

క‌రోనా విజృంభిస్తున్న వేళ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ ఇటీవ‌ల అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే మొత్తం 16 మంది ఇంటి స‌భ్యుల నుంచి ఒక‌రు ఎలిమినేట్ కాగా.మ‌రొక‌రు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచారు.

ఇక మొద‌టి వారం అలా అలా జరిగినప్పటికీ.రెండోవారంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కాస్త‌ పెంచ‌డంతో బిగ్‌బాస్ హౌజ్ ‌సంద‌డి మారింది.

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.మార్నింగ్ మస్తీలో భాగంగా.

Advertisement

దేత్తడి హారిక అందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఫుల్ ఎంటర్ టైన్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.దీంతో రంగంలో దిగిన దేత్త‌డి హారిక చిట్టి పొట్టి బ‌ట్ట‌లు ధ‌రించి ఓ రేంజ్‌లో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసి ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్యుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ర్యాప్ సింగర్ నోయ‌ల్‌ను ప్రేమిస్తున్నాను.పెళ్లి చేసుకుంటాన‌ని.

గంగ‌వ్వను అమ్మమ్మా అంటూ ఒప్పుకోమ‌ని సీన్ క్రియేట్ చేసి అల్ల‌రి చేసింది హారిక‌.అందుకు నోయ‌ల్ సైతం వంత ప‌లుకుతూ గంగ‌వ్వ‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు.

అయితే పెళ్లైన వాడిని పెళ్లి చేసుకుంటావా?.సిగ్గు లేదా?.అంటూ కామెడీగా ఫైర్ అయింది గంగ‌వ్వ‌.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

అంతేకాదు, నీ పేరు రాసి చచ్చిపోతా అని నోయల్ అన‌గా.పోయి చావు అంటూ గంగవ్వ దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పింది.

Advertisement

దీంతో ఇంటి స‌భ్యులంద‌రూ ఫుల్ ఖుషీ అయ్యారు.ఇక మొత్తానికి అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో ఇంటి స‌భ్యుల‌ను న‌వ్వించింది హారిక‌.

కాగా, ఈ వారం తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.వారిలో నోయల్, కరాటే కళ్యాణి, మోనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్ మ‌రియు గంగ‌వ్వ‌లు ఉన్నారు.

మ‌రి ఈ తొమ్మిది మందిలో ఎవ‌రు బ్యాగ్ స‌ద్దేస్తారో చూడాలి.

తాజా వార్తలు