ఆ బిల్లు గాని ఆమోదం పొందిందా, ఇక భారతీయులకు పండగే!

అవును, అమెరికా కాంగ్రెస్ సభలో అధికార డెమోక్రటిక్ పార్టీ 2023 పౌరసత్వ బిల్లును( Citizenship Bill ) ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఈ బిల్లును గాని పాలకులు అనుకున్నట్టుగా ప్రవేశపెట్టి దానిపైన ఆమోదముద్ర పడితే మాత్రం అమెరికాలోని భారతీయులతో( USA NRIs ) పాటు మెక్సికన్ల పంట పండినట్టే.

విషయం ఏమంటే, గ్రీన్ కార్డుల జారీలో దేశాలవారీ కోటాను ఎత్తివేసి, హెచ్1బి వీసాల జారీలో( H1B Visa ) కీలకమైన మార్పులు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.ఇక దేశాలవారీ కోటాల వల్ల గడిచిన సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన గ్రీన్ కార్డులను వలసదారుల సంతానానికీ, భార్యలు లేదా భర్తలకు మంజూరు చేయడం ద్వారా వలసదారుల కుటుంబాలను ఏకం చేయాలని సిఫార్సు చేయడం విశేషం.

కుటుంబాల వలసకు దేశాలవారీ కోటాలను పెంచాలని ప్రతిపాదించింది.స్టెమ్ కోర్సుల్లో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి పీజీ డిగ్రీలు పొందినవారు అమెరికాలో ఉండిపోవడానికి వీలు కల్పించాలని కూడా కోరింది.

అదేవిధంగా హెచ్1బి వీసాదారుల కుటుంబీకులకు ఇక్కడ పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది.ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలసవచ్చిన 1.1 కోట్ల మందికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉండడం కూడా ఒక విధంగా పౌరులకు మేలు చేకూరినట్టే అని చెప్పుకోవాలి.వీరిలో వ్యవసాయ కూలీలు కూడా వుంటారనే విషయం తెలిసినదే.

Advertisement

ఇకపోతే సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చినా కూడా అక్కడ పన్నులు సక్రమంగా చెల్లించినవారికి ఐదేళ్లలో పౌరసత్వం ఇవ్వాలని బిల్లు సూచించినట్టు తెలుస్తోంది.కాబట్టి ఇదేగాని జరిగితే చాలామందికి ఇక అక్కడ తిరుగులేనట్టే.అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం ఎన్నికల స్టెంట్ అని కొట్టి పారేయడం కొసమెరుపు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు