మద్రాస్ అమ్మాయిని పడేసిన జమైకా కుర్రాడు: కమలా హారీస్ తల్లిదండ్రుల లవ్‌స్టోరీ..!!

అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల బరిలోకి అనూహ్యంగా దూసుకొచ్చిన భారత సంతతి మహిళ కమలా హారిస్ గురించి అందరికి తెలిసిందే.

కానీ ఆమె తల్లిదండ్రుల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది అంతంత మాత్రమే.

కమల తల్లి ఓ భారతీయులరాలని, తండ్రి ఓ జమైకన్ అని పత్రికలు, టీవీల ద్వారానే బయటికొచ్చింది.కానీ, కమలా హారిస్ తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు.

వారి లవ్ స్టోరీలోకి ఎంటరైతే.తల్లి శ్యామలది తమిళ సాంప్రదాయ కుటుంబం.తండ్రి డొనాల్డ్ హ్యారిస్ జమైకా పౌరుడు.1962లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్ హ్యారిస్ అనే యువకుడు ఆఫ్రో అమెరికన్ అసోసియేషన్ స్టడీ గ్రూప్ సమావేశం జరుగుతోంది.అక్కడి విద్యార్ధులను ఉద్దేశించి నాటి బ్రిటిష్ వలసవాద ధోరణిపై ఆయన ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు.

ఆయన ఉపన్యాసానికి ఊగిపోతున్న విద్యార్ధులు, స్పీచ్ ముగిసిన తర్వాత చప్పట్లు, కేరింతలతో తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.సరిగ్గా ఇదే సమయంలో ఆ భారీ విద్యార్ధుల గుంపును చీల్చుకుంటూ ఓ భారతీయ యువతి ఆ జమైకన్ కుర్రాడి దగ్గరికి వెళ్లింది.

Advertisement

తన పేరు శ్యామలా గోపాలన్ అని, సైంటిస్టుగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుంది.మీ స్పీచ్ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ప్రశంసించింది.ఆయన ఎవరో కాదు కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్.

శ్యామల కూడా అతనిలాగే బ్రిటీష్ వలస పాలనలో వున్న భారతదేశంలోనే పుట్టింది.అయితే, ఆమె తండ్రి గోపాలకృష్ణన్ నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వంలో ఉన్నతాధికారి కావడంతో ఎక్కడా వివక్ష ఎదురుకాలేదు.

ఇద్దరి అభిప్రాయాలు, భావాలు కలవడంతో శ్యామల- హారిస్ మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.అలా ఆత్మీయుల సాక్షిగా 1963లో వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో కమలా హారిస్ పుట్టారు.ఆమె పెరుగుతున్న కొద్ది తల్లిదండ్రుల మధ్య విభేదాలూ పెరిగాయి.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

దాంతో 1970 ప్రాంతంలో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.

Advertisement

ఆ రోజుల్లో డొనాల్డ్ హారిస్ పార్ట్ టైమ్ ఉపన్యాసకుడిగా పనిచేసేవారు.అటు శ్యామల సైతం బ్రెస్ట్ క్యాన్సర్‌లో హర్మోన్ల పాత్రపై సిద్ధాంత వ్యాసాన్ని ప్రచురించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.అలా తన పరిశోధన నిమిత్తం ఏదో ఓ విశ్వవిద్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది.

దీంతో ఆమెకు కమల బాధ్యత ఓ సమస్యలా మారింది.ఆ సమయంలో శ్యామలకు రెజీనా షెల్టన్ అనే డే కేర్ సెంటర్ నిర్వహకురాలు పరిచయం కావడంతో ఆమె దగ్గర చిన్నారి కమలను వదిలిపెట్టి తను పరిశోధనలో నిమగ్నమయ్యేది.

అదే సమయంలో కమలా హారిస్ తల్లి వద్ద పొందాల్సిన ప్రేమానురాగాలను షెల్టన్ ద్వారా పొందింది.కమలకు ఆమె అంటే ఎంతో ప్రేమ, గౌరవం వుండేది.

కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బైబిల్ మీద ప్రమాణం చేసింది.అది, రెజీనా వ్యక్తిగత బైబిల్.

అలా అనీ శ్యామల మీదా ప్రేమ లేదని కాదు.తనపై మా అమ్మ ప్రభావం చాలా ఎక్కువని కమలా హారిస్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

ఆమె పెంపకమే తనను ఇంతటిదానిని చేసిందని చెబుతారామె.ఏ క్యాన్సర్‌పై అయితే శ్యామల పరిశోధనలు చేశారో అదే క్యాన్సర్ మహమ్మారితో 2009లో ఆమె మరణించారు.

కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్ ఆర్ధిక శాస్త్ర ఉపన్యాసకుడిగా రిటైరయ్యారు.

తాజా వార్తలు