హమాలీ కార్మిక సంఘాలతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం బివై.

నగర్ లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఇందులో హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది.ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి,సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ హమాలీ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని , ఐకెపి సెంటర్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు క్వింటాలకు 50 రూపాయల కూలీ ప్రభుత్వమే నిర్ణయించి రైతుల నుండి కాకుండా ప్రభుత్వమే నేరుగా చెల్లించాలన్నారు.హమాలీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం , ఇన్సూరెన్సు , గుర్తింపు కార్డులు అందించాలని వలస కార్మికులకు కాకుండా స్థానిక హమాలీలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి 23 వ.తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు.అయినా కూడా ఇప్పటివరకు కలెక్టర్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయలేదని తొందర్లోనే ఐకెపి సెంటర్లను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

కావున హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కారం కాకుంటే కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.వెంటనే జిల్లా కలెక్టర్ వారం రోజుల్లోగా హామాలి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే కార్మికులందరూ కూడా పనులను బందు చేస్తామని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు గొర్రె మల్లేశం , ఆనుముల రవి , సింగిరెడ్డి శంకర్ , పిట్టల శ్రీనివాస్ , శాస్త్రిబోయిన లింగం , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News