కమల్ పై దాఖలైన పిటీషన్ ను కొట్టిపారేసిన ఢిల్లీ హైకోర్టు...తమిళనాడు ఫోరమ్ ను సంప్రదించాలి అని సూచన

మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ హిందువుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ పిటీషన్ పై విచారణ జరపడానికి ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.

కమల్ హాసన్ తమిళనాడులో ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబందించిన ఫోరమ్ లోనే పిటీషన్ వేయాలని పిటీషనర్ కు కోర్టు సూచించింది.అదే విధంగా పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసినట్లు తెలుస్తుంది.

మహాత్మాగాంధీ ని చంపిన నాధూరాం గాడ్సే హిందుత్వ సభ్యుడు అని, స్వతంత్ర దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువే నంటూ ఇటీవల కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలు హిందుత్వ సంస్థలు,బీజేపీ నేతలు కమల్ పై విరుచుకుపడుతున్నారు.

మరి కొందరు అయితే కమల్ నాలుక కోయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కమల్ పై చర్యలు తీసుకోవాలిఅని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి అని కోరుతూ ఢిల్లీ కోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఆ పిటీషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.తమిళనాడు లో కమల్ ఈ వ్యాఖ్యలు చేసారు కాబట్టి అక్కడి ఫోరమ్ ను సంప్రదించాల్సి ఉంటుంది అని పిటీషనర్ కు కోర్టు సూచించింది.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు