తెల్ల జుట్టుకు దూరంగా ఉండాల‌నుకుంటే ఖ‌చ్చితంగా ఇలా చేయండి!

తెల్ల జుట్టు.మ‌నిషిని మాన‌సికంగా కృంగదీసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

వ‌య‌సు పైబ‌డే కొద్ది జుట్టు తెల్ల బ‌డుతున్నా పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు.

కానీ, చిన్న వ‌య‌సులోనే న‌ల్ల‌గా ఉండాల్సిన జుట్టు తెల్ల బ‌డితే.

ఇక వారి బాధ వ‌ర్ణ‌ణాతీతం.అందుకే తెల్ల జుట్టు వ‌చ్చాక దానిని క‌వ‌ర్ చేసుకునేందుకు ముప్ప తిప్ప‌లు ప‌డే బ‌దులు రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.నీటిలో క‌డిగిన ఉల్లిగ‌డ్డ‌ను స‌న్న‌గా త‌రుముకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఉల్లిపాయ తురుము, ఒక క‌ప్పు ఆలివ్ ఆయిల్ వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లారబెట్టుకుని ఆయిల్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ ఆయిల్‌లో వ‌న్ టేబుల్ స్పూన్‌ ఇన్‌స్టెంట్ గ్రీన్ టీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక తెల్ల జుట్టు స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.ఒకవేళ తెల్ల జుట్టు ఉన్నా క్ర‌మంగా న‌ల్ల‌గా మారుతుంది.అలాగే కొంద‌రు హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డుతూ ఉంటారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

అలాంటి వారికి కూడా ఈ రెమెడీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.నాలుగైదు రోజుల‌కు ఒక‌సారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలే స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది.

Advertisement

తాజా వార్తలు