దీపిక పిల్లి కెరీర్ ఇలా అయ్యిందేంటి..?

టిక్ టాక్ తో పాపులర్ అయ్యి స్మాల్ స్క్రీన్ పై ఛాన్స్ అందుకున్న దీపిక పిల్లి( Deepika Pilli ) ఢీ డ్యాన్స్ షో( Dhee Show ) యాంకర్ గా చేసి ఆ క్రేజ్ తో స్టార్ మాలో అదిరింది షోకి కూడా హోస్ట్ గా కొన్నాళ్లు అలరించింది.

ఇక ఆ టైం లోనే వాంటెడ్ పండుగాడ్( Wanted Pandugad Movie ) సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేసింది.

బుల్లితెర మీద అమ్మడి హడావిడి ముగిసింది అనుకునేలోగా ఆహా లో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది.ఆ షోకి జడ్జ్ గా అనీల్ రావిపుడి చేశారు.

ఇప్పుడు అది కూడా ముగిసింది.దీపిక పిల్లి ఖాళీ అయిపోయింది.స్మాల్ స్క్రీన్ మీద కూడా ఎక్కడ కనిపించట్లేదు.

ఇక టీవీ షోలు చేస్తున్న టైం లో అటు షోలతో పాటు ఇన్ స్టాగ్రాం లో తన హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని అలరించిన దీపికా అక్కడ కూడా సైలెంట్ అయిపోయింది.మరి స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్ త్వరగానే కెరీర్ గ్రాఫ్ పెంచుకుంది అనుకునేలోగా దీపికా ఇలా సైలెంట్ అవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Advertisement

దీపిక పిల్లి కెరీర్ రిస్క్ లో పడిందా అమ్మడు నెక్స్ట్ ఏం చేయబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు