విశాఖ గంగవరం పోర్టు వివాదంలో చర్చలపై ప్రతిష్టంభన

విశాఖపట్నంలోని గంగవరం పోర్టు వివాదంలో చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.ఈ క్రమంలో అదానీ యాజమాన్యం ప్రతిపాదనలను కార్మికులు తిరస్కరించారు.

కార్మికుల మొత్తం ఐదు డిమాండ్లలో మూడింటికి యాజమాన్యం రాతపూర్వక హామీ ఇచ్చింది.అయితే సమాన పనికి సమాన వేతనంపై హమీ లభించలేదు.

ఈ క్రమంలో తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేరే వరకు ఉద్యమం ఆపేది లేదని కార్మికులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

యాజమాన్యం ఇచ్చిన హమీని కార్మికులు నిరాకరించడంతో ఆందోళన మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

Advertisement

మరోవైపు పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు