కాంగ్రెస్ గ్రూప్ వార్ పై డీసీసీ అధ్యక్షురాలు రియాక్షన్

వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పై డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ స్పందించారు.

ఈ క్రమంలో ఎవరిని ఎవరు క్రేన్ కు వేలాడదీయాల్సిన అవసరం లేదని చెప్పారు.

నాయకులు ఉన్నది కొట్లాట పెట్టడానికి కాదని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు.ఇలాంటి చర్యల వలన నష్టం ఎవరికో కార్యకర్తలకు తెలుసని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

అయితే టికెట్ కొండా సురేఖదే అంటూ కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్

తాజా వార్తలు