మీ ఫోన్లో గేమింగ్ యాప్స్ ఉన్నాయా.. అయితే తస్మాత్ జాగ్రత్త..!

స్మార్ట్ ఫోన్( Smart phone ) ఉపయోగిస్తున్న అందరూ కచ్చితంగా ఫోన్ లో గేమింగ్ యాప్స్( Gaming apps ) డౌన్లోడ్ చేసుకుని తీరిక సమయాలలో, టైంపాస్ కాని సమయాలలో గేమ్స్ ఆడుతూ ఉంటారు.

కొందరు సరదా కోసం ఆడితే మరికొందరు డబ్బు సంపాదించడం కోసం ఆన్లైన్ గేమ్స్ పై ఆధారపడుతుంటారు.

అయితే కొన్ని గేమింగ్ యాప్స్ ఫోన్లో ఉంటే చాలా ప్రమాదం అని మీకు తెలుసా.? ఈ యాప్స్ తో ఫోన్ సులభంగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉందనే విషయం మీకు తెలుసా.శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం గేమింగ్ యాప్స్ తో మనకు తెలియకుండానే మన డేటా యాక్సెస్ చేయవచ్చు.

అది ఎలా అంటే క్యాండీ క్రష్ సాగా, కార్రమ్ పూల్, డిస్క్ గేమ్( Carrum Pool, a disc game )లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్న క్రమంలో ముందుగానే డేటాకు యాక్సెస్ కొరుతాయని, మనకు తెలియకుండానే వాటికి యాక్సెస్ ఇచ్చేస్తామని నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు లూడో కింగ్, సబ్ వే సర్ఫర్స్( Ludo King, Subway Surfers ) లాంటి గేమ్స్ కూడా ఎంతో డేంజర్.

ఈ గేమింగ్ యాప్స్ ఫోన్లో ఉంటే ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, లోకేషన్ లాంటి డేటాను ఈ గేమింగ్ యాప్స్ థర్డ్ పార్టీకి ఇస్తాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది.మన భారతదేశంలో దాదాపుగా 50 ఫేమస్ గేమింగ్ యాప్స్ ఉన్నాయి.ఇందులో 38 యాప్స్ ఫోన్లో ఉండే డేటాను థర్డ్ పార్టీకి అందిస్తుంది.

Advertisement

అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే గేమింగ్ యాప్స్ కు లొకేషన్ యాక్సెస్ తో పెద్దగా అవసరం ఏమీ లేదు.కానీ యాప్ డౌన్లోడ్ సమయంలో కచ్చితంగా లొకేషన్ యాక్సెస్ అడగడానికి ప్రధాన కారణం ఫోన్లో ఉండే డేటాను యాక్సెస్ చేసుకోవడానికే.చాలామంది ఈ విషయం గమనించి ఉండరు.

దీన్నిబట్టి అర్థం అవుతుందా ఈ గేమింగ్ యాప్స్ మనల్ని ఎంత డేంజర్ లోకి నెట్టేస్తాయో.కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు