రాజకీయ మంటేనే ఒక చదరంగం.ఏ పార్టీ ఏ నాయకుడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది పెద్ద రహస్యం.
చెప్పేది చేయక పోవడం.చేసేది చెప్పక పోవడమే అసలైన రాజకీయ నాయకుని లక్షణం.
నిప్పు లేనిదే పొగ రాదు అనే నానుడి బహుశా వీళ్ళ నుండి పుట్టిందేమో అనిపిస్తుంది.నేటి రాజకీయ నాయకుల చిత్రం చూస్తుంటే.
టిఆర్ఎస్ నుండి ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి మళ్లీ సొంత గోటికి వస్తున్నారు.కారణం సారు పెట్టిన కొత్త పార్టీ బి ఆర్ ఎస్.నిన్నటి మొన్నటి వరకు కిక్కిరిస్తుంది కారు వలస నేతలతో.పార్టీలో తమకు ఎక్కడ గుర్తింపు దక్కదో అని ముందుచూపుతో ఇతర పార్టీలలో జంప్ అయినారు కొందరు నేతలు.
అధికార పార్టీలోకి వస్తే తమ పనులు చక్క పెట్టుకోవచ్చు అనే ఆలోచనతోటి ఇతర పార్టీల నుంచి వలస వచ్చారు ఇంకొందరు నేతలు.కెసిఆర్ పెట్టిన ఆపరేషన్ ఆకర్ష పథకంతో అప్పట్లో ప్రతిపక్షంతో సహా టిడిపి నుంచి కూడా దాదాపు ఎందరో నేతలు కండువాలు మార్చుకున్నారు.
టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.పథకానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు.దాదాపుగా అటు కాంగ్రెస్ ఇటు టిడిపి తుడిచిపెట్టుకుపోయే అని చెప్పవచ్చు.
బిజెపిని తన ప్రతిపక్షంగా ఎన్నడు భావించలేదు అప్పట్లో కేసీఆర్.వారికి ఉన్న అతి తక్కువ సంఖ్యాబలం తో తమని ఎదుర్కోలేరని బలమైన నమ్మకం అప్పట్లో కెసిఆర్ కి ఉండేది.
కానీ అది తప్పని ఆలస్యంగా రుజువైంది.కెసిఆర్ అంచనాలు కొంత మేరకు తలకిందులు అయినాయి.
బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి చాలా మటుకు బలపడిందని చెప్పవచ్చు.ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పోయిస్తున్నాడు.
ఇటువంటి తరుణంలో టిఆర్ఎస్ నుంచి బిజెపికి వలసలు మొదలైనాయి.ఈటెల రాజేందర్ పార్టీ నుంచి వైదొలగిన తర్వాత అతను నేనుగా వెళ్లి బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు ఢిల్లీలో అమిత్ షా సాక్షిగా.
కెసిఆర్ కి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.అప్పట్లో కెసిఆర్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు.
తేలిగ్గా తీసుకోవడం జరిగింది.దాని యొక్క మూల్యం భారీగా చెల్లించుకున్నాడు తర్వాత.
హుజురాబాద్ నుండి బిజెపిలోకి వెళ్లిన ఈటెల రాజేందర్ భారీగా మెజార్టీతో గెలుపొందాడు.చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇక టిఆర్ఎస్ పతనం మొదలైందని భావించారు.
ఇటువంటి వలసలు అనేకం జరుగుతాయని భావించారు.పార్టీ పెట్టిన మొదలు కేసీఆర్ వెన్నంటే ఉన్న ఎందరో సీనియర్ నేతలు కొంత అసహనంలో ఉన్నారు.
సారు మమ్మల్ని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం తమ గోడు వెళ్లబోసుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.
కొత్తగా వచ్చిన వాళ్లకే పదవులు ఇస్తున్నారని పాతవారిని పక్కన పారేశారని సన్నిహితుల వద్ద వాపోయారు.కెసిఆర్ మటుకు ఏం చేస్తాడు పాపం.
అందరికీ స్వాగతం అని గేట్లు తెచ్చాక మళ్ళీ మోకాలు అడ్డు పెడితే ఏం బాగుంటుంది.ముందొచిన చెవులకన్నా కన్నా వె నక వచ్చిన కొమ్ములు వాడి.
అని నానుడి ప్రకారం కొత్తగా వచ్చిన వలస నేతలకు అగ్ర తాంబూలం దక్కుతుందని పార్టీ సీనియర్లు కొంతవరకు ఆందోళన చెందారు.వీరి ఆందోళన గమనించిన పార్టీ అధినాయకుడు కేసిఆర్ కారు ఎంత నిండినా మీరంతా భేఫికర్ గా ఉండండి.
అని సీనియర్ లందరికీ హామీ ఇచ్చాడు.అప్పటికే కారు కిక్కిరిసిపోయింది.
చేసుకున్న నాయకులు తమ విలువ కోల్పోతున్నామని ప్రాధాన్యం ఇవ్వడం లేదని కాస్త అలుపులు విడుపులు మొదలు పెట్టారు.కొందరైతే తమ అసహనాన్ని బహిరంగంగా వెలబుచ్చారు.
ఇంకొందరు ఇతర పార్టీల వైపు దృష్టి సారించారు.పార్టీలో చిన్నాచితక నేతలు వలస వెళ్తే పెద్దగా నష్టం ఉండదు.
ఒక ఎమ్మెల్యే స్థాయి కేడర్ ఉన్న భారీ నేతలు వలస వెళ్లడం పార్టీకి అటు టిఆర్ఎస్ కేసిఆర్ కి ఎంతో నష్టం.ఈ విషయం గ్రహించిన కేసీఆర్ అదును చూసి ఎప్పటినుంచో తన మనసులో కోరికని వెలిబుచ్చారు.
తనని నమ్ముకొని వచ్చిన నేతలకు అన్యాయం జరగకూడదని భావించారు.ఆ బావన తోటి ఆయన టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారుస్తూ కొత్త నాయకుడిగా కొత్త అవతారం ధరించాడు.
కిక్కిరిసిన కారులో ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ లో మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు.ఇది గ్రహించి గతంలో వలస వెళ్లిన కొందరు నేతలు తిరిగి చేరుతున్నారు.
ఇతర పార్టీల నుంచి మళ్లీ కారు ఎక్కుతున్నారు.కెసిఆర్ కి ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం.
బీఆర్ఎస్ ని విస్తీర్ణం చేసి విశాల పరిచి ఒక జాతీయ పార్టీగా తయారు చేయాలని కెసిఆర్ బలమైన కాంక్ష.ఆయన కోరిక త్వరలో నెరవేరబోతుందని చెప్పవచ్చు.
కారులోకి వస్తున్న తమ పూర్వ నేతలు మరియు ఇతర పార్టీలో నుండి వస్తున్న కొత్త నేతలతో బిఆర్ఎస్ బలపడుతుందని చెప్పవచ్చు.కెసిఆర్ గత కొంతకాలంగా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు.
పార్టీ కార్యాలయం యొక్క నిర్మాణ ప నులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఆయన గత వారం రోజులుగా ఢిల్లీలో బిజీ బిజీగా పర్యటన చేస్తున్నారు.కేవలం తన వ్యక్తిగతమైన ని ఇతర పార్టీల నాయకులతో కలవడం లేదని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.కెసిఆర్ పెట్టిన కొత్త పార్టీ పట్ల ఆకర్షితులై ఎందరో యువకులు సైతం ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పక్కర్లేదు.ముఖ్యంగా గడ్డ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ నేతలు సైతం ఈ పార్టీ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.
కొందరు ఇతర పార్టీ లలో గౌరవం కోల్పోయిన రాజకీయ నాయకులు సైతం సారు కారువైపు చూస్తున్నారు.అందరిని ఎక్కించుకునేందుకు కారు సిద్ధంగా ఉందా? కారులో ఇందరు నాయకులకి తగిన చోటు వసతి లభిస్తాయ? చెప్పడం కష్టం.పాత ఒక రోత కొత్త ఒక వింత అనే సామెత ప్రకారం టిఆర్ఎస్ కి కొత్తల్లో కొంత జనాకర్షణ రావడం సహజం.2024లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు ఇచ్చే తీర్పుపై కొత్త పార్టీ యొక్క భావితం ఆధారపడి ఉంటుంది.సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలతో అన్ని నియోజకవర్గాలలో ఎంతో బలంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది టిఆర్ఎస్.
వలస వచ్చిన నేతలకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు అనేది పార్టీ నేతలలో చర్చిని అంశం.టిఆర్ఎస్ నుండి బిజెపికి మారిన బోనగిరి ఎంపీ బూర గౌడ్ తనకు టిఆర్ఎస్ లో తగిన గౌరవం దక్కట్లేదని వాపోయారు.
పార్టీ మొదలు కేసీఆర్ తో కలిసి పని చేసిన తనను ప్రస్తుతం పక్కన పడేశారన్నారు.మునుగోడు లో జరిగే ఉప ఎన్నికకు తనకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు.
సీనియర్లని పట్టించుకోకపోతే ఇలాగని ఆయన తీవ్ర అసంతృప్తికి గురై వెంటనే బిజెపిలో కి చేరిపోయారు.ఊహించని పరిణమంగా భావించినది టిఆర్ఎస్.అయితే పార్టీ అన్నాక రాజకీయం అన్నాక వలసలు సహజం.
ఒకనాటి మిత్రులు ఒకనాటి శత్రువులు కావచ్చు.శత్రువులే నేను మంచి మిత్రులు కావచ్చు.
రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు.ఈ విషయం అన్ని పార్టీలో అందరినీ నేతలకు స్పష్టంగా తెలుసు.
తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎంత కైనా తెగిస్తారు.అలాగే ఎంతకైనా దిగజారుతారు ఇది రాజకీయం అంటే.
ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి ఎక్కడ నెగ్గాలో తెలుసుకునే వాడే అసలైన రాజకీయ నేత.
సీనియర్ టిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ గతంలో టిఆర్ఎస్ పై అలకతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు.పార్టీ స్థాపించిన మొదలు కేసీఆర్ తో కలిసి పనిచేశానని అలాంటి తనను చిన్నచూపు చూశారని ఆనాడు ఆవేదనతో శ్రవణ్ కాంగ్రెస్లోకి చేరారు.మళ్లీ ఇంత కాలానికి కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ పట్ల ఆకర్షితుడై కేసీఆర్ పట్ల అభిమానంతో ఆయన చేస్తున్న అనేక విజయవంతమైన అభివృద్ధి పనులను చూసి తిరిగి టిఆర్ఎస్లోకి అడిగినారు.
ఆయనతో పాటే బిజెపి నుండి మండలి మాజీ అధ్యక్షుడు స్వామి గౌడ్ కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.కేటీఆర్ సమక్షంలో.కారులో ఎక్కే వారి కంటే దిగే వారి సంఖ్య తక్కువగా ఉంది.
విధంగా టిఆర్ఎస్ కి మరియు బిఆర్ఎస్ కి చాలా బలమైన అంశంగా పరిగణించవచ్చు.రానున్న ఎన్నికలలోపు ఇంకా ఎన్ని జంపు జిలానీలు జరుగుతాయో చెప్పలేము.
ఇప్పటికే నిండుకుండైనా టిఆర్ఎస్ బీ ఆర్ఎస్ గా మారి యువ నేతలకు ఇతర పార్టీ నుండి వచ్చే నేతలకు స్వాగతం పలుకుతూ కారు డోరు తీసే ఉంచారు.కేసిఆర్ సారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy