ఆలుగడ్డలను అతిగా తింటున్నారా.. అయితే డేంజర్ లో పడినట్లే!

ఆలుగడ్డలు.( Potato ) వీటిని బంగాళదుంపలు అని కూడా అంటారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఆలుగడ్డలు ముందు వరుసలో ఉంటాయి అన‌డంలో సందేమం లేదు.

పైగా ఆలుగడ్డ చాలా మందికి ఫేవరెట్ అని కూడా చెప్పుకోవాలి.

ఆలుగడ్డలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అయితే ఆలుగడ్డ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తీసుకుంటే మాత్రం డేంజర్ లో పడినట్లే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆలుగడ్డ పై ఉన్న ఇష్టంతో కొందరు వారంలో మూడు నాలుగు సార్లు అయినా దాన్ని తీసుకుంటూ ఉంటారు.ఇంకొందరు అయితే రెగ్యులర్ గా కూడా ఆలుగడ్డను తింటారు.ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ అధిక మొత్తంలో ఉంటాయి.

Advertisement

అందు వల్ల బరువు తగ్గాలనుకునే వారు ఆలుగడ్డను అతిగా‌ తింటే బాడీలో మరింత కొవ్వు పెరుగుతుంది.దీంతో వెయిట్ లాస్ కాదు వెయిట్ గెయిన్( Weight gain ) అవుతారు.

అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఆలుగడ్డను చాలా తక్కువగా తీసుకోవాలి.

అలాగే ఆలుగడ్డలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.అందువల్ల ఆలుగడ్డను ఓవర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి.మధుమేహం బాధితులకు ఇది చాలా రిస్క్ అవుతుంది.

ఆలుగడ్డలను అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్,( Gas ) ఎసిడిటీ, డయేరియా, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.కాబట్టి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఆలుగడ్డలో అధిక మాత్రం తీసుకోకండిఇక కొందరు ఆలుగడ్డ తో చిప్స్ తయారు చేసుకుని తింటుంటారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

కానీ ఆలుగడ్డ చిప్స్ అస్సలు తీసుకోకూడదు.ఇవి మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.కొలెస్ట్రాల్( Cholesterol ) ను పెంచి గుండెకు ముప్పును రెట్టింపు చేస్తాయి.

Advertisement

అందుకే ఆలుగడ్డను బాయిల్, బేక్, స్టీమ్ వంటివి చేసి తీసుకోవాలి.

తాజా వార్తలు