డేంజర్ బెల్స్.. గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక

గూగుల్ సెర్చ్ చేసే ప్రతిఒక్కరికీ గూగుల్ క్రోమ్ గురించి తెలిసే ఉంటుంది.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ఫ్లాట్ ఫామ్ గా గూగుల్ క్రోమ్ కొనసాగుతుంది.

గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేయాలన్నా.ఏదైనా అవసరం ఉన్నా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సేవలను పొందవచ్చు.

అయితే గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది.గూగుల్ క్రోమ్ పాత వెర్షన్లు 104.0.5112.101ను ఉపయోగించేవారి కంప్యూటర్లపై మాల్వేర్ సాయంతో భారీ ఎత్తున దాడులు చేసే అవకాశముందని తెలిపింది.పాత వెర్షన్లు ఉపయోగించే గూగుల్ క్రోమ్ యూజర్లు ఈ దాడులకు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది.

పాత వెర్షన్లు ఉపయోగించేవారు మాల్వేర్ బారిన పడకకుండా బ్రౌజల్ ను అప్ డేట్ చేసుకోవాలని పేర్కొంది.భారతదేశానికి చెందిన యూజర్ల కంప్యూటర్లలో ఏదో తెలియని మాల్వేర్ ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈర్ టీ విభాగం ప్రతినిధులు గుర్తించారు.

Advertisement

ఈ ప్రమాదకర మాల్వేర్ సాయంతో కంప్యూటర్ ను హ్యాక్ చేసే అవకాశముందని తెలిపారు.

సేబర్ నేరగాళ్లు మాల్ వేర్ సాయంతో కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశముందని చెప్పారు.పీసీ లేదా ల్యాప్ ట్యాప్ లో ఉన్న డేటాను దొంగలించే అవకాశముందని తెలిపారు.ఆ డేటాను డార్క్ వెబ్ లో పెట్టి అమ్మేసి సొమ్ము చేసుకుంటారని హెచ్చరించారు.

ఫెడ్ సీఎం, స్విప్ట్ షేర్, ఏంజెల్ బ్లింక్,సైన్ ఇణన్ ఫ్లో వంటి ఫ్రీ సాఫ్ట్ వేర్ లు ఉపయోగించే యూజర్లకు మరింత ప్రమాదకరమని చెప్పారు.అందుకే ఆన్ లైన్ లో ఫ్రీగా లభించే సాప్ట్ వేర్ లు ఉపయోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఆర్టీ-ఇన్ హెచ్చరించింది.

వీడియో: ఇది ఎక్కడ బౌలింగ్ రా బాబు.. ఇట్లా చేతులు తిప్పుతున్నాడేంటి..
Advertisement

తాజా వార్తలు