కలుపు ను నివారించడం కోసం పిచికారి మందులను వాడితే జరిగే నష్టాలు..!

వ్యవసాయ రంగం( Agriculture sector )లో రసాయన పిచికారి మందుల ఉపయోగం విపరీతంగా పెరిగింది.

ఈ మధ్యకాలంలో కలుపును నివారించడానికి కూడా రసాయన పిచికారి మందులపై అధికంగా రైతులు ఆధారపడుతున్నారు.

అయితే రసాయన పిచికారి మందుల వల్ల కలుపు నివారించబడుతుంది కానీ వేసిన పంట పై కూడా ఆ పిచికారి మందు ప్రభావం చూపించి దిగుబడి తగ్గేలా చేస్తుంది.ఎప్పుడో ఒకసారి అత్యవసర పరిస్థితులలో కలుపు నివారణ కోసం రసాయన పిచికారి మందులను ఉపయోగిస్తే పర్వాలేదు.

కానీ నిరంతరం అధిక మోతాదులో ఉపయోగిస్తే తీవ్ర నష్టం ఎదుర్కోవలసిందే.

రసాయన పిచికారి మందులను ఉపయోగించడం వల్ల ఆకుల రంగు మారిపోతుంది. కొమ్మలు( Branches ) సాగినట్టుగా అవుతాయి.ఆకు కాడలు మరియు ఈనెలు పొడవుగా మారతాయి.

Advertisement

కలుపు మందు వాడిన కొద్ది రోజుల్లోనే పొలంలో మొక్కలలో ఈ మార్పులు గమనించవచ్చు.ముఖ్యంగా మొక్కల యొక్క లేత ఆకులపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఆకుల పై భాగంలో ఉబ్బిన బుడిపెలు కూడా గమనించవచ్చు.ఆకుల ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.

ఆకులు చాలా త్వరగా తమ రంగును కోల్పోతాయి.ఆకు పసుపు నుండి తెలుపు ఆ తర్వాత గోధుమ రంగులోకి మారుతుంది.

ముదిరిన ఆకులు మరియు పెద్దవైన ముదిరిన కాయల కు మాత్రం నష్టం కలగదు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
4 సెకన్లకు కోటి రూపాయలు.. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ ఇంతకు మించి సాక్ష్యం కావాలా?

అత్యవసర పరిస్థితులలో పొలంలో కలుపు మందులు నివారించడం కోసం పిచికారి మందులను ఉపయోగించాల్సి వస్తే.అప్పుడు పంట మొక్కలపై ఈ మందులు పడకుండా జాగ్రత్తగా పిచికారి చేయాలి.వాతావరణ సూచనలను గమనిస్తూ వర్షం వచ్చే సమయాలలో ఈ మందులు వాడకూడదు.

Advertisement

పక్క పొలాలలో ఈ మందులు చేరకుండా ఉండడానికి గాలివీస్తున్న సమయంలో కలుపు నివారణ మందులు వాడకూడదు.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవడం, తొలి దశలోనే కలుపు నివారణ చర్యలు చేపట్టడం, పొలంలో అంతర కృషి చేయడం.

కలుపు నివారణ తరువాతే పొలానికి నీటితో పాటు ఎరువులు అందించడం లాంటివి పాటించడం వల్ల కలుపు సమస్య( Weed problem ) దాదాపుగా తగ్గుతుంది.ఇక రసాయన పిచికారి మందుల ఉపయోగంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు.

తాజా వార్తలు