తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి26, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.16

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.29

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: సా.5.00 ల5.15

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36

మేషం:

ఈరోజు చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి.

ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే
మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...

వృషభం:

Advertisement

ఈరోజు దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది.సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

మిథునం:

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వాధికారులు నుండి సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

ముఖ్యమైన విషయాలలో బద్దకించడం మంచిది కాదు.కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం:

ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు.అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది.

వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది.

కన్య:

ఈరోజు దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

తుల:

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ధన వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి.

నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృధా ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

మకరం:

ఈరోజు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు