నాన్న అంటే నాన్నే, కూతురి కోసం స్కూల్ ఫంక్షన్‌లో నాన్న డాన్స్... వైరల్ అవుతున్న వీడియో!

కూతురు - నాన్నల ప్రేమ గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవలసిన అవసరం లేదు.కూతురిని కన్న ప్రతీ తండ్రి తనకు మహారాణి పుట్టిందని అభిప్రాయపడతాడు.

సాక్షాత్తూ లక్ష్మీదేవినే తన ఇంట్లో కొలువు దీరిందని ముచ్చటపడతాడు.కటిక పేదరికంలో కూడా ఎంతో గారాబంగా పెంచుకుంటాడు.

ఏ ఇంట్లో అయితే కూతుళ్లు ఉంటారో? వాళ్ళు భాగ్యవంతులు అని పెద్దలు చెబుతూ వుంటారు.ఇలాంటి నాన్న ప్రేమను ప్రత్యక్షంగా చూస్తే ఇంకేమైనా వుందా? చూసినవారు కుళ్ళుకుంటారు.తాజాగా అలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, తండ్రి తన కుమార్తెకు డ్యాన్స్ నేర్పడంలో సహాయం చేస్తూ కనిపించడం స్పష్టంగా కనిపిస్తోంది.పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న తన కూతురికి స్టెప్స్ ను ప్రాంప్ట్ చేస్తూ ఆ తండ్రి పడుతున్న తపన చూస్తే కూతుళ్లు లేని తండ్రులు కుళ్ళుకోక తప్పదు.

Advertisement

దలేర్ మెహందీ ఐకానిక్ సాంగ్ ‘తునక్ తునక్’కి డ్యాన్స్ చేస్తోంది ఆ పాప.అయితే వేదికపై కూతురు డ్యాన్స్ చేస్తుండగా.తన కూతురు సాంగ్ కు స్టెప్స్ మరచిపోకుండా.

ఎదురుగా నిల్చుకుని సెప్ట్స్ ను ప్రాంప్ట్ చేయడం విశేషం.

దాదాపు 24 సెకన్ల నిడివి గల ఈ వీడియోను IPS అధికారి అయినటువంటి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.ఇక ఈ వీడియోకు అతగాడు ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ కూడా ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు.ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 1.92 లక్షల మంది చూడగా, 9244 మంది లైక్‌ చేయడం విశేషం.అంతేకాకుండా కొన్ని వేలమంది రీ ట్విట్స్ తో మోతమోగిస్తున్నారు.

తండ్రీ-కూతురు ద్వయంపై నెటిజన్లు తమ కామెంట్ల రూపంలో ప్రేమను కురిపిస్తున్నారు.మరెందుకాలస్యం, మీరు కూడా ఓ లుక్కేయండి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు