వైరల్: రూ.5 విలువైన చిప్స్ ప్యాకెట్‌లో ఏం వచ్చిందో చూసి షాకయిన కస్టమర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు?

సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కరకరలాడే ఆలూ చిప్స్ బాగా ఇష్టపడుతుంటారు.

కూల్ డ్రింక్ తాగుతూ చిప్స్ తింటే వచ్చే మజానే వేరు.

చిప్స్ తినడం మొదలుపెడితే అవి అయిపోయేంత వరకు ఆపలేము.ఈ చిప్స్ అన్ని దుకాణాల్లోనూ లభిస్తాయి.

రకరకాల బ్రాండ్లు ఆలూ చిప్స్ అమ్ముతుండగా వాటిలో లేస్ బాగా పాపులర్ అయింది.ఈ లేస్ ప్యాకెట్స్ చూడ్డానికి చాలా పెద్దగా కనిపిస్తాయి కానీ వాటిలో ఉండే చిప్స్ వేళ్లపై లెక్కించవచ్చు.

అంటే ఆ ప్యాకెట్లలో కేవలం పది లోపే చిప్స్ ఉంటాయి.ఇక ఐదు రూపాయల చిప్స్ చూడడానికి చాలా పెద్దగా కనిపించినా అందులో ఉండే చిప్స్ సంఖ్య తెలిస్తే అవాక్కు అవ్వడం ఖాయం.తాజాగా ఓ నెటిజన్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.5 రూపాయల విలువైన లేస్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు సదరు నెటిజన్.తీరా ఓపెన్ చేసి చూసేసరికి అందులో కేవలం 6 చిప్స్ మాత్రమే ఉన్నాయి.

Advertisement

జోక్ ఏంటంటే.ఆ ప్యాకెట్‌పై 40 శాతం ఎక్కువ చిప్స్ అనే ఓ ఆఫర్ కూడా కనిపించింది.దీన్ని బట్టి ఆ 40 శాతం ఆఫర్ లేకపోతే రూ.5 ప్యాకెట్‌లో కేవలం నాలుగు చిప్స్ మాత్రమే ఉండేవేమో.ఒక్క ఆలుగడ్డతో కనీసం యాభై చిప్స్ ఈజీగా తయారు చేయవచ్చు.ఆ ఆలూ ధర మార్కెట్ లో రూ.10 ఉన్నా.వాటిని కొనుగోలు చేసి ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చు.

కానీ అంత సమయం లేక చాలా మంది రెడీమేడ్ లేస్ ప్యాకెట్ పై ఆధారపడుతున్నారు.

అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో లేస్ కంపెనీ ఐదారు చిప్స్ మొహాన కొట్టి డబ్బులు కాజేస్తోంది.కస్టమర్లందరూ చిన్నపిల్లలే కాబట్టి తమకు అడ్డు ఏమీ లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి ఈ కంపెనీలు.కానీ తాజాగా ట్విట్టర్ లో ఒక నెటిజన్ కడిగి పారేశాడు.

దాంతో ఆ నెటిజన్ కు మద్దతుగా వేలమంది ముందుకొచ్చారు.ఇలాంటి కంపెనీలు విక్రయించే చిప్స్ ప్యాకెట్లు అసలు కొనుగోలు చేయకూడదని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

స్థానిక దుకాణాల్లో చిప్స్ రుచికరంగానే తయారు చేస్తారని.అక్కడే చిప్స్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

లేస్ కక్కుర్తి తీరుపై మిగతా నెటిజన్లు అందరూ తిట్టిపోస్తున్నారు.

తాజా వార్తలు