ఈ మొసలి నీటిలోనే కాదు, భూమ్మీద కూడా దుమ్ముదులపగలదు!

స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి బతకలేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మశక్యం కాదేమో.అంతలాగ మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అనేవి భాగమైపోయాయి.

ఇక స్మార్ట్ ఫోన్ వాడకం ఎప్పుడైతే పెరిగిందో రకరకాల సోషల్ మీడియాలు పుట్టుకొచ్చి, కంటెంట్ అన్న పదానికి అర్ధాన్నే మార్చేశాయి.చిన్న చిన్న వీడియోలలో వున్న కంటెంట్ చూడడానికి మనిషి అలవాటు పడ్డాడు.

ఈ క్రమంలో కొన్ని కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది.

Advertisement

సాధారణంగా మొసలి అనేది నీటిలో వున్నంత వరకే దాని ప్రతాపాన్ని చూపగలడు.ఒక్కసారి నేలమీదికి వస్తే అది వానపాము అయిపోతుందని అంటారు కదా.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే ఓ మొసలి భూమ్మీద కూడా తన ప్రతాపాన్ని చూపించింది.విషయం ఏమంటే అక్కడ దాన్ని కట్టడి చేయడానికి సెట్ చేసిన ఫెన్సింగుని సైతం విరిచేసింది.ఏంటి? అవాక్కయ్యారా! మీరు విన్నది నిజమే.అయితే మొసలి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళెవరూ దీన్ని నమ్మరు.

కానీ ఇది నిజం.ఫ్లోరిడాలో ఈ తంతు జరగగా నేడు సోషల్ మీడియాలో సదరు వీడియో హల్ చల్ చేస్తోంది.

ఇక వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, ఓ మొసలి ఒక రోడ్డు ఇవతలి వైపు నుంచి అవతలి వైపుకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ ఊచలు దానిని డిస్టర్బ్ చేసాయి.ఇక అంతే, అక్కడి ఐరెన్ రాడ్స్ ని వంచేసి అందులో నుంచి ఎంచక్కా దూరి వెళ్లిపోతుంది.కాగా సదరు వీడియోని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

సాంకేతికంగా ఇది డైనోసార్ అంటూ ఓ యూజర్ ఈ వీడియోకి కామెంట్ పెట్టగా, మరొక యూజర్ ఈ మొసలి నీటిలోనే కాదు, భూమిపైన కూడా నెట్టుకు రాగలదు అని కామెంట్ చేసాడు.కాగా ఓ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకు దీన్ని 50 లక్షల మంది చూశారు.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)
Advertisement

తాజా వార్తలు