వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన మొదట్లో సీఎం జగన్ వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.దేశవ్యాప్తంగా జగన్ పేరు మారుమోగింది .
జగన్ ఒక సంచలనానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. జగన్ ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గాని, నిర్ణయాలు గాని దేశవ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగించాయి.
జగన్ మాదిరిగా పరిపాలన చేసేందుకు ఎంతో మది ముఖ్యమంత్రులు ప్రయత్నించారు .ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.అయితే రాను రాను జగన్ వ్యవహార శైలిపై జనాల్లోనూ ఆసక్తి బాగా తగ్గిపోయింది.ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో జగన్ చిక్కుకుంటున్నారు.
అదికాకుండా అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటి వరకు జగన్ పెద్దగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసేందుకు ముందుకు రావడం లేదు.ఏ విషయమైన మంత్రులు, అధికారులతోనే ముందుకు నడిపిస్తున్నారు తప్ప, జగన్ ఎక్కువగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పరిమితమైపోతున్నారు.
ఏపీలో అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.జనాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు .ఏ సందర్భంలోనూ జగన్ నేరుగా జనం లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విషయంలో చొరవ చూపించలేదు.ఇప్పటికీ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
ఈయన సంగతి ఇలా ఉంటే, తమిళనాడులో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ జనాల్లోకి దూసుకువెళ్లి పోతున్నారు.

అకస్మాత్తుగా ఆర్టిసి బస్సు ఎక్కి జనాలు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు .రోడ్లపైన కాన్వాయ్ ను ఆపి ప్రజల సమస్యలను, వినతులను స్వీకరిస్తూ వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు.ఇక గత కొద్ది రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను స్వయంగా స్టాలిన్ వెళ్లి బాధితులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ భరోసా ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే స్టాలిన్ తో జగన్ కు పోలిక పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.స్టాలిన్ మాదిరిగా ఎప్పుడూ జగన్ జనాల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విషయంపై దృష్టి సాధించలేకపోయారు అంటూ జగన్ పై విమర్శలు తీవ్రం అయ్యాయి.