పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు.
ఇప్పుడు మరోసారి ఆయన మీద ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.అయితే ఈ సారి ఆయన వ్యాఖ్యలు చేయకపోయినా.
ఆయనకు సంబంధించిన ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ కామెంట్లు ఇప్పుడు దేశంలో తీవ్రమైన కలవరం రేపుతున్నాయి.ఆయన పాకిస్తాన్ ప్రజలకు ఓ ప్రకటన చేశారు.
అయితే అది కాస్తా వివాదాస్పదంగా మారిపోయింది.
ఒక బాధ్యతాయుత మైన పదవిలో ఉండి ఇలాంటి ప్రకటనలను ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు ప్రజలు.
ఆయన చేసిన ప్రకటనలో పన్నులు అలాగే జీఎస్టీ ఎవరైతే చెల్లించకుండా ఉంటారో వారి ఓటు హక్కు ఉండదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.ఇది కాస్తా వ్యాపారవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది.
తాను కేవలం వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్లు చేయడంతో వారంతా భగ్గుమంటున్నారు.ముఖ్యంగా చిన్న, మధ్యతరహా బిజినెస్ లు నడిపించుకునే వారంతా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య యుతంగా వచ్చిందని దాన్ని ఎలా లాక్కుంటారంటూ మండిపడుతున్నారు.

పాకిస్తాన్‌లో వ్యాపారాలు చేసుకునే వారిని ఇలా టార్గెట్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని హెచ్చరిస్తున్నారు.ఈ దుమారం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు తాకుతోంది.ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన షౌకత్ తరిన్ ను ఇమ్రాన్‌పట్టుబట్టి ఆర్థిక సలహాదారుడిగా నియమించాడు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్‌కు చెడ్డ పేరు తెస్తున్నారని పార్టీ నేతలే తీవ్రంగా విమర్శిస్తున్నారు.అయితే గతంలో కూడా ఆయన వల్ల ఇమ్రాన్ మాటలు పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని పాకిస్తాన్ మీడియా ద్వారా తెలుస్తోంది.
చూడాలి మరి ఇమ్రాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
.