రఘురామకృష్ణంరాజు అరెస్టు పై సంచలన కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం చుట్టూ ఏపీ రాజకీయం జరుగుతోంది.

కరోనా లాంటీ క్లిష్టసమయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటం పై దృష్టి పెట్టకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపీ అరెస్ట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి.

తాజాగా ఈ అరెస్ట్ వ్యవహారంపై సిపిఐ నారాయణ స్పందించారు.రఘురామకృష్ణంరాజు అరెస్టు వెనకాల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని పేర్కొన్నారు.

అమిత్ షా కేసిఆర్ సపోర్ట్ లేకపోతే.రఘురామకృష్ణంరాజు ని అరెస్టు చేసే వారు కాదని.

ఆయన స్పష్టం చేశారు.అదే రీతిలో రఘురామకృష్ణంరాజు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరైనది కాదని ఖండించారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టులకు బిజెపి పెద్దల నుండి అనుమతులు వస్తున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈటెల రాజేందర్ పై కెసిఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజల భవిష్యత్తును గట్టిగా బుద్ధి చెబుతారని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!
Advertisement

తాజా వార్తలు