తిరుమలలో ఎవరూ ఊహించనంత పని చేసిన ఆవు?

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే నానుడి మనందరికీ తెలిసినదే.

మనం చేసేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా లేదా పనులలోనైనా ఆ దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఆ పనులను నెరవేర్చ గలుగుతాము.

మనం ఎంత కష్టపడినా ఆ దేవుని కృప మన మీద లేకపోతే ఎటువంటి పనులు కూడా సాగవు.కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం.

ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.దేవుడి దర్శనార్థం దేశ,విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

కోరిన కోర్కెలు తీర్చే ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలు చేరేందుకు కాలినడకన భక్తులు వెళుతుంటారు.తిరుమల దేవస్థానాన్ని15 వందల సంవత్సరాల నుంచి పాలకుల ఆదరణకు నోచుకుంది.

Advertisement

పల్లవ రాణి సామవై క్రీ.శ 614 వ సంవత్సరంలో ఆనంద నిలయం నిర్మింపబడినది.

కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు.స్వామివారి లీలలతో ఎప్పుడు భక్తులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

తాజాగా ఇటువంటి సన్నివేశం ఒకటి తిరుమలలో చోటుచేసుకుంది.స్వామివారి మొక్కుబడిగా ఎంతో మంది భక్తులు కాలినడకన ఏడుకొండలు మెట్ల ద్వారా నడిచి వెళ్తుంటారు.

మనుషులకే ఎంతో అసాధ్యం తో కూడుకున్న ఈ పనిని ఒక ఆవు ఎంతో చాకచక్యంగా ఆ 7 కొండలు ఎక్కి తిరుమలకు చేరుకుంది.మనుషులతో పాటుగా మెట్లు ఎక్కుతున్న నేపథ్యంలో కాలి నడకన వెళ్లే భక్తులు ఆవుకి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, గోమాతకు నమస్కరించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇలా ఆవు మెట్లు ఎక్కుతూ తిరుమల కొండను చేరుకోవడం వెనుక ఆ శ్రీవారి లీలలు ఉన్నట్లుగా అక్కడ భక్తులు భావించి ఆ గోమాతకు పండ్లను ప్రసాదంగా పెట్టి నమస్కరించు కుంటున్నారు.తిరుమలకు చేరుకున్న ఈ ఆవును టీటీడీ అధికారులు గుర్తించి అవును గోశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు