'పాన్ ఇండియా కౌంటర్స్' తో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న టాలీవుడ్... పరువు పాయే ?

ఇటీవల కాలంలో ఎక్కువగా టాలీవుడ్ నుండి వస్తున్న సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి.

ముఖ్యంగా ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీని హేళనగా చూసిన బాలీవుడ్ గడ్డ మీదనే ఘన విజయాలు సాధిస్తూ అక్కడి హీరో, దర్శక నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

దీనితో వందల కోట్ల రూపాయలు వసూళ్ళ రూపంలో సాధిస్తూ మన సత్తాను చాటుతున్నాయి.దీనితో రానున్న కాలంలో ఎక్కువ సినిమాలు బాలీవుడ్ లో విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే అన్ని సినిమాలను అక్కడ రిలీజ్ చేసుకుంటూ పోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.అందుకే కంటెంట్ ఉండే కథలను మాత్రమే అక్కడ విడుదల చేయాలి.

అయితే పాన్ ఇండియా స్థాయి ఉన్న హీరోలను ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో కథలో భాగంగా విమర్శించడం అలవాటుగా మారింది.తాజాగా ఈ తరహా డైలాగ్ ను మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లో కమెడియన్ వెన్నెల కిషోర్ దగ్గర డైరెక్టర్ చెప్పించిన డైలాగ్ ఇపుడు వైరల్ అవుతోంది.

Advertisement
Counters In Pan India Issue Vennela Kishor Hero Ram Details, Counters ,pan India

ఒక సందర్భంలో భాగంగా వెన్నెల కిషోర్ నేను పాన్ ఇండియా కమెడియన్ అనడం విమర్శలకు తావిస్తోంది.ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ది వారియర్ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ టీజర్ లో పాన్ ఇండియా రౌడీ ని అంటూ లింగుస్వామి చెప్పించిన డైలాగ్ కూడా విమర్శలకు గురి అవుతోంది.అయితే ఎందుకు ఈ విధంగా పాన్ ఇండియా అనే పదాన్ని మోస్తున్నారు అంటూ అందరూ విమర్శిస్తున్నారు.

Counters In Pan India Issue Vennela Kishor Hero Ram Details, Counters ,pan India

అంతే కాకుండా కొందరు ఇలా పాన్ ఇండియా అనుకుంటూ మన పరువును మనమే తగ్గించుకుంటున్నాం అంటున్నారు.పాన్ ఇండియా స్థాయిని కామెంట్ చేసినట్లే ఉంది అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కానీ నిజానికి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయి చిత్రాల సంఖ్య ఎక్కువయిన విషయం కరెక్టే.

కానీ హీరోల ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో చిత్రాలు నెలకొల్పడం కూడా సమంజసమే కదా అంటున్నారు.అయితే ఇక్కడ ఒక విషయం అర్దం చేసుకోవాలి.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

మన హీరోలు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఫెయిల్ అయినంత మాత్రాన పాన్ ఇండియా రేంజ్ ఏమీ తగ్గిపోదు.అయితే చాలా వరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసి విఫలం అయినవారున్నారు.

Advertisement

అయితే ఇలాంటి వారిని మనము ప్రోత్సహించాల్సినది పోయి మనమే వారి పరువు తీస్తున్నాము.సౌత్ లో మంచి హీరో అయి ఉంది మంచి సబ్జెక్ట్ తో ఉత్తరాదిన సినిమా తీసి హిట్ కొడితే వారిని పాన్ ఇండియా స్టార్ లు అంటారు.కానీ చిన్న చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా అనడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి.

అందుకే చిన్న సినిమాలను గొప్పలకు పోయి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి వీలు లేదు.ఒకవేళ మంచి సినిమా అనుకంటే అప్పుడు విడుదల చేయాలి.కానీ సబ్జెక్ట్ లేకుండా విడుదల చేసి బాలీవుడ్ లో ఫెయిల్ అయితే పోయేది మన పరువే అన్నది మరిచిపోకండి.

తాజా వార్తలు