జూలై 3న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం

కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం వచ్చే నెల 3వ తేదీన జరగనుంది.

ఈ సమావేశానికి కేబినెట్ లోని మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరు కానున్నారు.

వారితో పాటు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు సైతం పాల్గొననున్నారు.అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కసరత్తు కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయని తెలుస్తోంది.

కాగా కేంద్రంలోని మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయన్న వార్తలు జోరుగా కొనసాగుతున్న సమయంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement