ఆ బావి నీళ్లు తాగితే కరోనా పోతుందట.. మీకు తెలుసా?

కరోనా వైరస్ విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి కరోనా వైరస్ ని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కోసం పరిశోధకులు రాత్రి పగులు తేడా లేకుండా శ్రమిస్తున్నారు.

అది ఏమి పట్టించుకోకుండా కొందరు పాపడ్ తింటే కరోనా వైరస్ తగ్గుతుందని అంటే మరికొందరు హెర్బల్ టీ అంటారు.మరికొందరు అయితే హనుమాన్ చాలీసా చదవండి కరోనా వైరస్ ను అంతం అని అంటారు.

తమిళనాడులోని ఒక షాపులో అయితే మైసూర్ పాక్ తింటే కరోనా వైరస్ మాయం అవుతుందని ప్రచారం చేశారు.తాజాగా ఇలాంటి ప్రచారమే ఒకటి వెలుగులోకి వచ్చింది.

అది ఏంటంటే? ఓ బావిలో ఉన్న నీళ్లు తాగితే కరోనా వైరస్ రానే రాదని ప్రచారం జరుగుతోంది.దీంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు వచ్చి ఆ బావిలోని నీళ్లు తెగ తోడుకుని పట్టుకుపోతున్నారు.

Advertisement

ఈ బావి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మొలంగూర్ అనే గ్రామంలో ఉంది.ఈ బావిల ఉండే నీరుకి సర్వరోగ నివారిణి అనే పేరు కూడా ఉంది.

కరోనా సమయంలో బావిలో నీరు తాగితే కరోనా రాదనీ పుకార్లు వినిపిస్తున్నాయి.దీంతో చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుండి ఆ బావిలో నీరు తీసుకొని వెళ్తున్నారు.

అది పుకారు మాత్రమే అని చెప్పిన ఆ జనాలు వినడం లేదు.దీంతో నిన్న మొన్న వరకు జనరల్ వాటర్ తాగినవారు కూడా ఇప్పుడు కరోనా వైరస్ భయంతో ఆ బావి నీరు తాగడం మానేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు