వెబ్ సిరీస్ కి ఆసక్తి చూపించని స్వీటీ.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్

ఒటీటీల హవా మొదలైన తర్వాత హీరోలు, హీరోయిన్స్ అందరూ వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.

ఎక్కువగా ఫేడ్ అవుట్ భామలు తమ మార్కెట్ పెంచుకోవడానికి నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే వెబ్ సిరీస్ లు అయితే కంటెంట్ బేస్ ఉంటాయి కాబట్టి తమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించేందుకు, నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.అలాగే స్టార్ దర్శకులు కూడా కమర్షియల్ జోనర్ నుంచి బయటకి వచ్చి తమలోని క్రియేటివిటీని చూపించుకోవడానికి వెబ్ సిరీస్ లు ఒక అవకాశంగా భావిస్తున్నారు.

దీంతో ఎక్కువమంది వీటిపై శ్రద్ధ చూపిస్తున్నారు.ఇక కరోనా సిచువేషన్ కూడా ఒటీటీ చానల్స్ హవా పెరగడానికి కారణం అయ్యాయి.

వెబ్ సిరీస్ లకు క్రేజ్ అమాంతం పెరగడంతో అగ్ర తారలు ఇప్పటికే వీటిలో నటించేందుకు క్యూ కడుతున్నారు.తాజాగా అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందని టాక్.

Advertisement

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అనుష్కకి సదరు చానల్ వారు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారని తెలుస్తుంది.అయితే ఆమె తనకి వెబ్ సిరీస్ లో నటించే ఉద్దేశ్యం లేదని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

బహు భాషల్లో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితే సరిపోతుందని నిర్మాతలు భావించి ఆమెని సంప్రదించారని టాక్.కానీ అనుష్క మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు.

ఆమె వీలైనన్ని సినిమాలు చేసి పెళ్లి చేసుకొని గృహిణిగా కొత్త జీవితం ప్రారంభించాలని చూస్తుంది.ఈ ఉద్దేశ్యంతోనే వెబ్ సిరీస్ లో చేయడానికి అయిష్టత చూపించిందని సమాచారం.

షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!
Advertisement

తాజా వార్తలు