ఏపీలో కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు !

రాష్ట్రంలో కరోనా కేసులు తారాస్థాయిలో నమోదవుతున్నాయి.రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

రోజూ పదివేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులను కట్టడి చేయలేకపోతున్నారు.

తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో 10,794 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,98,125కు చేరింది.70 మంది మరణించగా.ఇప్పటివరకూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,417కి చేరింది.11,915 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఆ సంఖ్య 3,94,019కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 99,689 యాక్టివ్ కేసులు ఉన్నాయని, నిన్న ఒక్కరోజే 72,573 కరోనా టెస్టులు నిర్వహించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 41,07,890 కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడం జరిగిందన్నారు.జిల్లాల వారీగా కరోనా కేసులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.అనంతరపురం జిల్లాలో 753, చిత్తూరు జిల్లాలో 927, ఈస్ట్ గోదావరిలో 1244, గుంటూరులో 703, కడపలో 904, కర్నూల్ లో380, నెల్లూరులో 1299, ప్రకాశంలో 1042, వెస్ట్ గోదావరిలో 1101, శ్రీకాకులంలో 818 కేసులు నమోదయ్యాయి.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు