రెండేళ్ల చిన్నారి ప్రాణాలను ఓ పిల్లి బలి తీసుకుంది.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాపను ఓ పిల్లి చేసిన తప్పు వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఈ విషాదకర ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది.చెన్నైలోని అయనవరం ప్రాంతంలో నివాసముంటున్న దంపతులకు రెండేళ్ల పాప ఉంది.
శనివారం ఆటలాడుతూ అలిసిపోయి పడుకుంది.దీంతో చిన్నారిని గదిలోనే టీవీ దగ్గర పడుకోబెట్టి తల్లిదండ్రులు వేరే పనిలో బిజీ అయ్యారు.
ఇంతలో ఇంట్లోకి ఓ పిల్లి దూరి అటూ ఇటూ స్టాండ్ పై దూకింది.
పిల్లి టీవీ స్టాండ్ పై దూకడంతో ఆ టీవీ కాస్త కింద పడుకున్న పాపపై పడింది.
భారీ శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.పాపపై టీవీ పడటంతో తలకు దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావమై కనిపించింది.దీంతో తల్లిదండ్రులు హుటా హుటిగా స్థానిక కిల్ పాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పాప అప్పటికే మరణించిందని నిర్ధారించారు.
ఆ మాట విన్న తల్లిదండ్రులు ఒక్కసారి కుప్పకూలారు.కంటి ముందే పాప ప్రాణం పోవడం చూసి శోకసంధ్రంలో మునిగారు.
గంటన్నర ముందే కంటి ముందు అల్లరి చేసిన కూతురు చనిపోయిందన్న వార్త విని కన్నీరుమున్నీరయ్యారు.