కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర ! ఆమె రంగంలోకి దిగుతున్నారా ?

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో జోష్ కనిపిస్తోంది.

మొదటి విడత బస్సు యాత్ర అనుకున్న మేరకు సక్సెస్ కావడం , రాహుల్ , ప్రియాంక గాంధీలు ఈ యాత్రలో పాల్గొనడంతో కాంగ్రెస్ కు మైలేజ్ బాగా వచ్చిందని , కేడర్ లో ఉత్సాహం పెరిగిందని,  జనాల్లోనూ కాంగ్రెస్ పై మరింత ఆదరణ పెరిగిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు .

ఇదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కొనసాగే బస్సు యాత్రను సక్సెస్ చేసి,  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాట వేసుకోవాలనే లెక్కల్లో ఉన్నారట.మొదటి విడత బస్సు యాత్ర సక్సెస్ కావడానికి రాహుల్ ప్రియాంక గాంధీలే ( Rahul Gandhi Priyanka Gandhi )కారణమని , వారి ప్రసంగాలు, జనాల్లోకి వెళ్లిన తీరు,  ప్రజల్లోకి బాగా వెల్లాయాని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

  ఇక రెండో విడత బస్సు యాత్రకు  సోనియాగాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.  సోనియాగాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఆమె పర్యటనను పరిగణలోకి తీసుకుని తెలంగాణలో ఆమె పర్యటనను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు .మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ బస్సు యాత్ర కారణంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు వచ్చిందని,  సోనియాగాంధీ స్వయంగా రెండో విడత బస్సు యాత్రలో పాల్గొంటే మరింతగా కాంగ్రెస్ బలం పెంచుకుంది అని అంచనా వేస్తున్నారు .

తెలంగాణ పిసిసి తరఫున ఇప్పటికే ఏఐసీసీ నేతలకు విజ్ఞప్తులు వెళ్లాయి సోనియాగాంధీ( Sonia Gandhi ) సైతం బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో రెండో విడత బస్సు యాత్రకు కాంగ్రెస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.బస్సు యాత్రతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో సోనియాతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట.సోనియాగాంధీ షెడ్యూల్ పరిగణలోకి తీసుకుని కీలకమైన సమయంలో ఆమె ను తెలంగాణకు రప్పించి బస్సు యాత్రకు మరింత ఆదరణ తీసుకురావాలని నిర్ణయించారు .అలాగే నామినేషన్ల సమయంలో తెలంగాణకు పిలిపించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారట.

Advertisement

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మొత్తం విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారట.తెలంగాణలో సోనియా గాంధీ( Sonia Gandhi ) అడుగు పెడితే పార్టీలో గ్రూపు రాజకీయాలు తగ్గుతాయని,  క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ప్రజల్లోనూ కాంగ్రెస్ పై ఆసక్తి పెరుగుతుందని,  ఇప్పటికే రాహుల్ , ప్రియాంక గాంధీ ల పర్యటనతో అది రుజువైందని , స్వయంగా సోనియా రంగంలోకి దిగితే పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతాయి అని అంచనాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు