వరంగల్ లో కాంగ్రెస్ కృతజ్ఞత సభ .. ఆయన వస్తున్నారా ? 

తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు ప్రక్రియ మొదలు పెట్టడంతో,  తెలంగాణ రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

అసలు కాంగ్రెస్ రుణమాఫీ అమలు చేయలేదని,  అది సాధ్యం కాదని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం , బీఆర్ఎస్ నేత హరీష్ రావు( Harish Rao ) రాజీనామా సవాల్ సైతం విసరడం వంటివన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు ప్రక్రియను మొదలుపెట్టారు.

దీంతో రేవంత్,  కాంగ్రెస్ గ్రాఫ్ మరింతగా పెరిగిందనే అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు .రెండో రోజు ఆయన పర్యటన కొనసాగుతోంది.ఈరోజు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కి సంబంధించి వరంగల్ లో భారీ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.

ఈ వరంగల్ సభలోనే రుణమాఫీని కాంగ్రెస్ ప్రకటించడంతో అక్కడే కృతజ్ఞత సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.నిన్ననే ఢిల్లీకి  రేవంత్ రెడ్డి వెళ్లారు.ఆయనతో పాటు,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లు సైతం రేవంత్ వెంట వెళ్లారు  వీరంతా ఈరోజు రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో భేటీ అయ్యి,  వరంగల్ సభకు రావలసిందిగా ఆహ్వానం పలకనున్నారు .రాహుల్ గాంధీతో పాటు,  ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ),  ఇతర ఏఐసిసి అగ్రనేతలను సభకు ఆహ్వానించనున్నారు.ఆగస్ట్ 3న రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న నేపథ్యంలో,  ఆ లోపే సభను నిర్వహించాలని భావిస్తున్నారు.

Advertisement

 ఈనెల 28న ఆదివారం వరంగల్ లో కృతజ్ఞత సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత అధికారికంగా దీనిపై క్లారిటీ రానుంది.ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలవనున్నారు.

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో వీరు చర్చించనున్నారు.మేడిగడ్డతో పాటు,  తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిన్న రాత్రి సుదీక్ష సమీక్ష నిర్వహించారు .అలాగే మరి కొంతమంది కేంద్ర మంత్రులను ఈరోజు రేవంత్ రెడ్డి బృందం కలవనుంది.  అయితే వరంగల్ లో నిర్వహించబోయే కాంగ్రెస్ కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీ హాజరవుతారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

  రాహుల్ గాంధీ ఆ సభకు హాజరైతే పార్టీ గ్రాఫ్ మరింతగా పెరుగుతుందని,  రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా డబల్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రాలు రెడీనా ?
Advertisement

తాజా వార్తలు