అసోం లో త్వరలో అసెంబ్లి ఎన్నికలు రాబోతున్నాయి.మొత్తం ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
పచ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ,అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లి ఎలెక్షన్స్ రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలోని పార్టీ నేతలు తమ తమ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.
అసోం లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా అక్కడ అధికారంలో ఉన్న బిజేపి పార్టీని గద్దె దించేందుకు మహాకూటమిగా ఏర్పడుతున్నామని, గుహటి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ నేతలు తెలిపారు.
ఈ కూటమిలో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ లతో కలిసి సీపీఐ, సీపీఎం, అంచలిక్ గణ మోర్చా, సీపీఐ ఎంఎల్ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడుతున్నాయి.
బరుద్దీన్ అజ్మల్ సారథ్యంలో ఈ కూటమి ఏర్పడుతుంది.బిజేపి వ్యతిరేక పార్టీ లు ఏమైనా ఉంటే మాతో కలిసి పనిచెయ్యవచ్చని పార్టీ నేతలు తెలిపారు.దేశంలో ప్రస్తుతం బిజేపి పార్టీ మహాశక్తిగా మారుతుంది.ఈసారి ఎలాగైనా బిజేపిని ఓడించడమే లక్ష్యం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఈ క్రమంలోనే అసోంతో కలిపి మిగిలిన నాలుగు రాష్ట్రలోను బిజేపి పోటీచేయ్యనున్నది.తమిళనాడులో ఇప్పటికే తమ ప్రచారం ను కొనసాగిస్తుంది.
గత ఏడాది అసెంబ్లి ఎన్నికలో పచ్చిమ బెంగాల్ కు ధీటుగా బిజేపి అసెంబ్లి సిట్స్ ను గెలుచుకుంది.ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బిజేపి చూస్తుంది.
కేంద్రం నుండి బిజేపి అధికార మంత్రులను రంగంలోకి దింపుతున్నారు.