ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 3,4 వ తేదీలలో విశాఖపట్నం లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకం గా నిర్వహించి దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని వాటికి సంబందించిన ఒప్పందాలు జరిగాయని పేర్కొంది….అత్యంత ఆర్భాటం గా నిర్వహించిన ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ముందు నుండి చివర వరకు చాలా పకడ్బందీగా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జరిగేలా చర్యలు తీసుకుంది….
అనుకున్నట్టు గానే విజయవంతం గా పూర్తి చేశామని ప్రభుత్వ పెద్దలు తెలియచేశారు.ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ పై మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి…ప్రతిపక్షాలు అయితే ఇదంతా ఒక బోగస్ కార్యక్రమమనీ విమర్శిస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం లక్షల కోట్ల లెక్కలు చూపిస్తూ ఆంధ్ర రాష్ట్ర యువతను ప్రజలను మోసం చేస్తోందని , అదంతా అంకెల గారడీ అని విమర్శించారు….నాలుగేళ్లుగా నిద్ర పోతూ ,రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురాక పోగా ఉన్న కంపెనీలు బయట రాష్ట్రాలకు తరిలిపోయెలా చేసి ఇప్పుడు ఎన్నికల సమయానికి ఎలక్షన్ స్టంట్ లు వేస్తున్నారని ఆరోపించారు.నిజమా ప్రబుత్వానికి చిత్త శుద్ది ఉంటే పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళి పోతుంటే చోద్యం చూస్తూ కూర్చోదని .తమ ఎంఎల్ఏ లు ఎంపి లు కంపని లను వసూళ్లకు ఇబ్బంది పెట్టినప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోనెదని ఆరోపించారు.

రాజకీయాల సంగతి పక్కన పెడితే రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తే నిరుద్యోగ సమస్య తో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని భావించిన రాష్ట్ర ప్రజలు మరియు యువత ఇప్పుడు ఆశకు అయోమయానికి మధ్యలో ఉన్నారు… మాటల రూపంలోనూ ,పేపర్ల పైన అక్షరాల రూపం లోనూ ఉన్న ఈ అంకెలన్నీ ఎప్పటికీ కార్యరూపం దాల్చి నిరుద్యగ సమస్యను ,లోటు వృద్ధి రేటు సమస్యను తీర్చేందుకు దోహదపడతాయో అని కొండంత ఎదురు చూస్తున్నారు…
.






