ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.ఈ మేరకు ఈ నెల 6వ తేదీన తుక్కుగూడ వేదికగా ‘జనజాతర’ సభను( Janajatara Sabha ) నిర్వహించనుంది.

 Congress Janajatara Sabha In Tukkuguda On 6th Of This Month Details, Congress Ja-TeluguStop.com

కాగా ఈ జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో( Mallikarjuna Kharge ) పాటు ముఖ్యనేతలు హాజరుకానున్నారు.దీంతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ క్రమంలోనే భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు తెలంగాణ పీసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కనీసం పది లక్షల మంది సభకు వచ్చే విధంగా జనసమీకరణ చేయాలని యోచనలో కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్లమెంట్ లకు మంత్రులు, ముఖ్యనేతలకు టీ -పీసీసీ ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.రేపు పార్లమెంట్ ఇంఛార్జ్ నేతలు అంతా తమ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని టీ-పీసీసీ ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube