టి –కాంగ్రెస్ కొత్త గేమ్..టీఆర్ఎస్ కి షాకే

కోదండరాం వృత్తి రీత్యా ఉస్మానియా లో ప్రొఫెసర్.ఉద్యమం రీత్యా.

తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు ఏర్పాటు చేసిన జాక్ కి అధ్యక్షులు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి జాక్ రూపంలో ఎంతో కృషి చేసిన వ్యక్తీ.

కేసీఆర్,కోదండరాం కలిసి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కోదండరాం ని పట్టించుకోవడం మానేశారు.

ఎ జాక్ మద్దతుతో ముందుకు నడిచారో ఆ జాక్ కేసీఆర్ అధికారంలోకి రాగానే దూరం చేసుకున్నారు.అంతేకాదు ఉద్యమ కాలంలో రాష్ట్రం ఏర్పడ్డాక అమలు చేస్తాను అన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చక పోవడంతో మెల్ల మెల్లగా కోదండరాం కేసేఆర్ పై విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ కి పక్కలో బల్లెంలా తయారయ్యారు.

Advertisement

ఇప్పుడు కోదండరాం టార్గెట్ అంటా టిఆర్ఎస్,కేసేఆర్ లే.నిరుద్యోగులకి అవకాశాలు కలిపించడం లో కేసీఆర్ విఫలం అయ్యాడు అంటూ కొలువుల కొట్లాటకి కోదండరాం పిలుపునిచ్చిన వెంటనే విద్యార్ధులు,నిరుద్యోగులు అత్యధికంగా స్పందించి కోదండరాం కి మద్దతుగా నిలిచారు.ఇక్కడే కేసీఆర్ కి టెన్షన్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఇదే సమయంలో కాంగ్రెస్ చూపు కోదండరాం పై పడింది.ఎందుకంటే కోదండరాం ఈ ఉద్యమ స్పూర్తిని రాజకీయాల వైపు మరల్చాలని కొత్తగా పార్టీని కూడా స్థాపింఛి.

కేసీఆర్ కి ప్రత్యామ్నాయం అవ్వడం కోసం రాజకీయ అడుగులు వేస్తున్నారు అని భావించిన కాంగ్రెస్ రంగంలోకి దిగింది.అయితే రాహుల్ గాంధీ ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోదండరాం వేరు కుంపటి పెట్టకుండా కాంగ్రెస్ లోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అని తెలుస్తోంది.

ఈ సమయంలోనే టి-కాంగ్రెస్ రాహుల్ గాంధీకి తెలంగాణా రాజకీయల మీద ఒక నివేదిక సమర్పించింది.టిడిపి,బిజెపి,టిఆర్ఎస్ మూడు కలిసి పోటీ చేయనున్నాయి అని తెలుసుకున్న కాంగ్రెస్.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
రంగంలోకి రాబిన్ శర్మ .. కీలక బాధ్యతలు ఇచ్చిన బాబు

ఇప్పుడు కేసీఆర్ కి వ్యతిరేక శక్తులని కూడగడుతోంది.టిఆరెస్ కి వ్యతిరేకంగా పార్టీలని కలుపుకుని వెళ్ళడమే మంచిది అని తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Advertisement

ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కంటే కూడా టి-జాక్ కాంగ్రెస్ కి పెద్ద తలనెప్పి గా మారడం చూస్తుంటే ఎక్కడ తమకంటే ముందు కోదండరాం దాటి పోతాడో.కాంగ్రెస్ పార్టీని ప్రజల దృష్టిలో రెండో ప్రతిపక్షం చేస్తాడో అని భావించి కోదండరాం ని తమ పార్టీలోకి ఎలా అయినా సరే రప్పించుకోవాలని భావిస్తోంది.

ఎందుకంటే రేవంత్ చెప్పింది అయినా సరే ప్రజలు నమ్ముతారో లేదో అనేది పక్కన పెడితే కోదండరాం మాట అంటే తెలంగాణా ప్రజలకి చాలా గౌరవం ఉంది కేసీఆర్ ని దెబ్బకొట్టాలి అంటే మాత్రం కోదండరాం ఒక్కడు చాలు అని భావిస్తునాయి.మరి కోదండరాం కాంగ్రెస్ ఆఫర్ కి ఎటువంటి రిప్లై ఇస్తాడో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు