ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) పని చేస్తుందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

సోమవారం వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి, నాగయ్య పల్లి లో ప్రభుత్వ విప్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చరమ గీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పాటున అందించిన వేములవాడ నియోజకవర్గ( Vemulawada ) ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు.

గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు( Free Current ), 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉన్న సిలిండర్ ధర 10 సంవత్సరాల తర్వాత 500 కే గ్యాస్ సిలిండర్( Gas Cylinder )) అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం అన్నారు.

ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు.రైతు భరోసా పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తుందని ఇప్పటివరకు 5 ఎకరా లోపు రైతు భరోసా( Raithu Barosa ) ఇచ్చామన్నారు.

Advertisement

గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతుబంధు ఇచ్చిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుందన్నారు.గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి,ప్రజా సేవ కోసం కాదన్నారు.

గత తొమ్మిదిన్నర సంవత్సరములు అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసింది ఏం లేదన్నారు.మర్రిపల్లి రిజర్వాయర్ ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గం నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానాన్ని అసెంబ్లీ పుస్తకంలో చేర్చారని గుర్తు చేశారు.త్వరలోనే మరిపెళ్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడతామన్నారు.

పార్టీలకతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా వేములవాడ నియోజకవర్గంలో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News