ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభం

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది.ఇందులో భాగంగా తెలంగాణలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది.

ఈ భేటీకి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, మాణిక్ రావు ఠాక్రేతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న 64 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

ఇవాళ లేదా రేపు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.అలాగే కొత్తగా చేరిన నేతలకు సీట్ల కేటాయింపుపై కూడా ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు