అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్, బీఆర్ఎస్..: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నారీశక్తి వందన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు.బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు ఏవీ నెరవేరలేదని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో ప్రారంభించి లక్ష కోట్లకు పెంచారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను సైతం మోసం చేసిందని మండిపడ్డారు.రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.

అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలంటూ ధ్వజమెత్తారు.

పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...
Advertisement

తాజా వార్తలు