గురుకులాల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష

గురుకులాల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 1వ తేదీ పరీక్ష తేదీ 23-02-2025 జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా :2025 - 26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆయా గురుకులాలు స్వీకరిస్తున్నాయి.

అలాగే ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఖాళీల భర్తీకి, టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ గౌలి దొడ్డి, అలుగునూర్ సీఓఈలలో 9 వ తరగతి లో ప్రవేశాలు, టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఖమ్మం, పరిగి ఎస్ఓఈలలో 8వ తరగతి లో ప్రవేశాలు, టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రకటన జారీ చేశారు.

దరఖాస్తుని https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలని సూచించారు.ఆయా ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల 01-02-2025 ఆఖరి తేదీగా ప్రకటించారు.పరీక్ష 23-02-2025న నిర్వహించనున్నారు.

అప్లై చేసుకునేందుకు కావలసిన సర్టిఫికెట్లు కులం, ఆదాయం, ఆధార్ కార్డు, జనన ధృవీకరణ, ఫోటో కావాలి.అభ్యర్థుల సహాయార్థం కలెక్టరేట్ లో సహాయ కేంద్రం ,అభ్యర్థుల సహాయార్థం సర్టిఫికెట్స్ సత్వరం జారీ చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కార్యలయ పనివేళ్ళల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 05 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు.ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.

Advertisement
కేటీఆర్ ని ఎదురుకోలేకనే అక్రమ కేసులు భారాసవివి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

Latest Rajanna Sircilla News