సినిమాల్లో కామెడీ చేస్తూ కనిపించిన కమెడియన్ బండ్ల గణేష్ గత కొద్ది రోజులుగా.బాగా ఫ్యామస్ అయిపోయాడు.
టీవీ చర్చా కార్యక్రమాల్లో … యూట్యూబ్ లో … సోషల్ మీడియా లో ఇలా ఎక్కడ చూసినా బండ్ల గణేష్ వీడియోలు .ఇంటర్వ్యూ లు దర్శనం ఇస్తున్నాయి.ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు.తెలంగాణ ఎన్నికల్లో ఎమ్యెల్యేగా పోటీ చేయాలనీ ఆశపడుతున్నాడు.అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఏ లిస్ట్ లోనూ … ఆయన పేరు కనిపించలేదు.అయినా బండ్ల అప్పుడే ఎమ్యెల్యే అయిపోయినట్టు మీడియా ముందు ప్రమాణ స్వీకారం చేసేసాడు.
ఇక బండ్ల టీవీ ఇంటర్వ్యూ లు చూస్తే… ఆయన్ను పొలిటిషన్ లా కంటే కమెడియన్ గానే ట్రీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే… బండ్ల గణేష్ కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.ఎమ్మెల్యే అవ్వాలంటే.పోటీ చేయాలి.
పోటీ చేయాలంటే.టిక్కెట్ కావాలి.
ఇప్పుడా ఆ టిక్కెట్టే రావడం లేదు.గాడ్ పవన్ కల్యాణ్ ని వదిలేసి.
గాడ్ ఫాదర్లను పట్టుకుని.రాహుల్ గాంధీతో కాంగ్రెస్ కండువా కప్పించుకుని.
ఇక పోటీనే అనుకుంటున్న సమయంలో .ఢిల్లీ నుంచి వరుసగా వస్తున్న జాబితాల్లో తన పేరు కనిపించడం లేదు.మొదటగా జూబ్లీహిల్స్ అనుకున్నారు.అక్కడ కలసి రాదని.
అనుకున్నారో.గాడ్ ఫాదర్లు సలహా ఇచ్చారో కానీ.రాజేంద్రనగర్ అన్నారు.టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి.చాలా సార్లు ఢిల్లీ వెళ్లారు.టీడీపీ అధినేత వస్తే కలిశారు.
రాజేంద్రనగర్ తనకు రాసి పెట్టి ఉందని.పొత్తులో భాగంగా టీడీపీకి అడగవద్దని అభ్యర్దించాడు.
కానీ … చంద్రబాబు దాన్ని పట్టిన్చుకోలేదు.రాజేంద్రనగర్ టీడీపీకే వచ్చింది.
అక్కడ్నుంచి మరో గణేష్ ను.అంటే గణేష్ గుప్తాను అభ్యర్థిగా ప్రకటించింది.దీంతో బండ్లకు మొండి చేయి మిగిలింది.

అయితే … ఇంతగా ఆరాటపడుతున్నా బండ్ల పేరు ఎమ్యెల్యే అభ్యర్థిగా … పరిశీలనకే వెళ్లలేదని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.అయినా బండ్ల గణేష్ కు ఆశలు తీరలేదు.ఏదో ఒక చోట పోటీ చేయాలనే తలంపుతో మిగిలిన సీట్లలో అయినాచోటు దొరుకుతుందేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ అందరూ ఆయనను పొలిటికల్ కమెడియన్ గానే చూశారు.ఇక ఆయనకు టికెట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు.
కానీ పొలిటికల్ కమెడియన్ గా మాత్రం బాగా ఫ్యామస్ అయిపోయాడు.మరి ఈ పొలిటికల్ కమెడియన్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.